ఏపీకి జరుగుతున్న అన్యాయంపై ఎన్నారైల ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం తగిన న్యాయం చేయడంలేదనే అభిప్రాయం తానా సభల్లో వ్యక్తమైంది. వాషింగ్టన్ డీసీలో జరుగుతున్న సభల్లో భాగంగా తెలుగువారినుద్దేశించి ప్రసంగించేందుకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ వేదికపైకి రాగానే సభికులు ఒక్కసారిగా నినాదాలు చేస్తూ ఆయన ప్రసంగానికి అడ్డుపడ్డారు. అయినా రాంమాధవ్ తన ప్రనసంగాన్ని కొద్దిసేపు కొనసాగించారు. అయితే కొందరు బీజేపీకి, మోదీకి వ్యతిరేకంగా కేకలు వేస్తుండటంతో ప్రసంగాన్ని ఆపేశారు. ఈ పరిణామంపై తానా నిర్వాహకులు సైతం విస్మయం వ్యక్తం చేశారు.













