హైదరాబాద్ లో ఘనంగా తాళ్లూరి వారి పెళ్లి సందడి
తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ సోదరుడు తాళ్లూరి రాజా కుమార్తె పూజ, రాజ్యసభ సభ్యుడు సీ.ఎం.రమేశ్ కుమారుడు రిత్విక్‌ల వివాహం హైదరాబాద్ హైటెక్స్‌లో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, కేవీపీ రామచంద్రరావు, మెగాస్టార్ చిరంజీవీ, హీరో బాలకృష్ణ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, మాజీ ఎంపీ మురళీమోహన్, మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణ, శ్రీనివాస్ కామినేని, మైసూరారెడ్డి , గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య తదితరులు, బిజెపి నాయకులు, Dr లక్ష్మణ్, రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహన్ రావు, వైఎస్సార్ పార్టీ మిథున్ రెడ్డి, టిఆర్ఎస్ మంత్రులు హరీష్ రావు, బాల కిషన్, సినీ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, రాజకీయ నాయకులు ఉండవల్లి అరుణ్‌కుమార్, అంబికా కృష్ణ, మరియు అనేకమంది ప్రముఖులు ఈ వివాహానికి హాజరు అయ్యారు.
ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరు రాధాకృష్ణ, ఎన్ టీవీ ఎండి చౌదరి, టీవీ 9 మాజీ సీఈఓ రవి ప్రకాష్ లతో సహా అనేక మంది మీడియా ప్రముఖులు వచ్చారు.
అమెరికా నుంచి ఎన్నారై టీడీపీ నాయకులు జయరాం కోమటి, తానా మాజీ అధ్యక్షులు గంగాధర్ నాదెళ్ల, పద్మశ్రీ ముత్యాల, వేమన సతీష్, డా.లకిరెడ్డి హనిమిరెడ్డి, తానా నాయకులు నిరంజన్ శృంగవరపు, హరీష్ కోయ, మన్నే సత్యనారాయణ, పెద్దిబోయిన జోగేశ్వరరావు, జగదీష్ ప్రభల, విజయ ఆసూరి, వేణు ఆసురీ, వీరు ఉప్పాల, రాకేష్ బత్తినేని, ప్రకాష్ బత్తినేని, వెంకట రమణ గంటి, తెలుగు టైమ్స్ ఎడిటర్ సుబ్బారావు చెన్నూరి తదితరులు హాజరయి నూతన వధూవరులను ఆశీర్వదించారు. తాళ్లూరి సోదరులు వచ్చిన ప్రముఖులను సాదరంగా ఆహ్వానించిన తీరు, చేసిన ఏర్పాట్లు బాగున్నాయని, వివాహం చాలా ఘనంగా జరిగిందని ఎన్ఆర్ఐ లు అభినందించారు.













