కరోనా కంటే దేవుడు గొప్ప అన్న పాస్టర్ ఇక లేరు
కరోనా ముప్పు నేపథ్యంలో 10 మంది కన్న ఎక్కువ మంది గుమిగూడొద్దని ప్రభుత్వం చెప్తే, ఈ భయంకరమైన వైరస్ కన్నా దేవుడు గొప్పవాడని నేను బలంగా విశ్వసిస్తున్నాను అంటూ ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవ మతాధికారి ఒకరు కరోనా సోకి కన్నూమూశారు. అమెరికాలోని వర్జీనియాకు చెందిన న్యూ డెలివరెన్స్ ఇవాంజలికల్ చర్చ్ వ్యవస్థాపకుడైన బిషప్ గెరాల్డ్ గ్లెన్ ఇటీవలే కరోనా కారణంగా చనిపోయారు. ఈ వైరస్‌కు భయపడొద్దని మార్చి 22న చర్చ్‌లో నిర్వహించిన ప్రార్థనల సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. గ్లెన్ మరణించిన నేపథ్యంలో ఆ వీడియోను చర్చ్ యూట్యూబ్ చానల్ నుంచి తొలగించారు.













