రక్షణ శాఖ బిల్లుకు అమెరికా సెనేట్ గ్రీన్ సిగ్నల్
అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించిన 675 బిలియన్ డాలర్ల బిల్లుకు హౌస్‌లో చట్టసభ్యులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఇందులో గతంలో పోలిస్తే మిలటరీ కోసం 2.6 శాతం నిధులు అత్యధికంగా కేటాయించారు. 359-49 ఓట్ల తేడాతో సెనేటర్లు బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దేశ అభివృద్ధికి సంబంధించి వస్తు సామాగ్రి కోసం 146 బిలియన్ డాలర్లు కేటాయించారు. ఇందులో 12 నేవీ షిప్‌లు, రెండు వర్జీనియాక్లాస్ సబ్ మెరైన్, అత్యాధునిక మూడు సముద్ర నౌకల కోసం 22.7 బిలియన్ డాలర్లు కేటాయించారు. రష్యా, చైనా, ఉత్తర కొరియాతో పాటు పలు దేశాల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని టెక్సాస్ రిపబ్లికన్ కే గ్రాంగర్ వివరించారు.













