కుమార్తె ప్రేమ వివాహానికి బిల్గేట్స్ ఓకే
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గ్రేట్స్ తన కుమార్తె ప్రేమ వివాహానికి అంగీకరించారు. బిల్మెలిండా దంపతుల కుమార్తె 23 ఏళ్ల జెన్నిఫర్గేట్స్కు రేసుగుర్రాల చోదకుడు నయెల్నాసర్(29)తో వివాహం నిశ్చితార్థం వైభవంగా జరిగింది. మంచుకొండల్లో వీరిద్దరి ఎంగేజ్మెంట్ సాగగా ఇపుడు ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. గడచిన కొన్నేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉండగా వారి వివాహానికి బిల్గేట్స్ అంగీకరించారు. తామిద్దరం ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నామని, భవిష్యత్తులో ప్రేమను పంచుకుంటూ ముందడుగు వేస్తామని ఈ సందర్భంగా అజెన్నిఫర్ వెల్లడించారు.













