డొనాల్డ్ ట్రంప్ కు షాక్.. ముందంజలో జో బైడెన్!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ ఆధిక్యంతో దూసుకుపోతున్నట్టు తాజా సర్వేలు చెబుతున్నాయి. 2016లో ట్రంప్ విజయ దుందుభి మోగించిన మూడు కీలక రాష్ట్రాల్లో ఇప్పుడు బైడెన్ ముందంజలో ఉన్నట్లు హిల్/ హారిస్ పోలింగ్ సర్వేలో తేలింది. గత ఎన్నికల్లో ట్రంప్ ఆధిక్యం సాధించిన నార్త్ కరోలినా, ఫ్లోరిడా, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో ఈసారి ఓటర్లు బైడెన్ వైపు మొగ్గు చూపుతున్నారు. అధ్యక్ష ఎన్నికలకు మరో మూడు రోజులే గడువు ఉన్న తరుణంలో ఈ పరిణామం ట్రంప్ వర్గాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది.













