డొనాల్డ్ ట్రంప్ కంటే లీడ్లో బిడెన్
క్యాంపెయిన్ విరాళాలకు సంబంధించి బ్యాంకు ఖాతా నగదు నిల్వలో డెమొక్రటిక్ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థి, డెమొక్రటిక్ నేషనల్ కమిటీ(డీఎన్సీ) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ నేషనల్ కమిటీ (ఆర్ఎన్సీ) కంటే 14.1 కోట్ల డాలర్ల నగదు లీడ్లో ఉన్నారు. సెప్టెంబర్ నెల నాటికి డిఎన్సి ఖాతాలో 46.6 కోట్ల డాలర్లు ఉండగా, ఆర్ఎస్పీ వద్ద 32.5 కోట్ల డాలర్లు ఉన్నాయని విడుదలైన క్యాంపెయిన్ ఫైనాన్స్ నివేదిక పేర్కొంది. జూన్ నెలలో ట్రంప్, ఆర్ఎన్సీ వద్ద బిడెన్, డీఎన్సీ కంటే 18.7 కోట్ల డాలర్లు అధికంగా ఉన్నాయని తెలిపింది. అయితే ఒక్క ఆగస్టులోనే బిడెన్-డిఎన్సీ కమిటీ రికార్డు స్థాయిలో 36.45 కోట్ల డాలర్లను సేకరించగా, ట్రంప్-ఆర్ఎన్సీ కమిటీ 21 కోట్ల డాలర్లు మాత్రమే సేకరించింది. ఒక బిడెన్ ప్రచారం ద్వారా మాత్రమే 21.2 కోట్ల డాలర్ల మేర విరాళాలు రాగా, అందులో 13.03 కోట్ల డాలర్లను వినియోగించారు. అదే విధంగా ట్రంప్ క్యాంపెయిన్ 6.17 కోట్ల డాలర్లు మాత్రమే సేకరించగా, 6.12 కోట్ల డాలర్లను ఖర్చు చేశారు.













