ఫ్లాయిడ్ ప్రపంచాన్ని మార్చాడు : జోయి బిడెన్
జార్జ్ ఫ్లాయిడ్ ప్రపంచాన్నే మార్చాడు.. అంటూ డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జోయి బిడెన్ నివాళి అర్పించాడు. ఆయన హ్యూస్టన్‌కు వెళ్లి జార్జి ఫ్లాయిడ్ కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. ఫ్లాయిడ్ హత్యోదంతం అమెరికా చరిత్రలో ముఖ్యమైన ఘటనగా ఆయన అభిప్రాయపడ్డారు. జార్జి ఫ్లాయిడ్ కుటుంబాన్ని కలుసుకున్నా. చక్కటి కుటుంబం అతడిది. డాడీ ప్రపంచాన్ని మార్చబోతున్నాడని ఫ్లాయిడ్ కూతురు నాతో చెప్పింది. అ•వును నిజమే. ఈ ప్రపంచంపై జార్జి ఫ్లాయిడ్ మృతి ఘటన ఊహంచని స్థాయిలో ఉంది. పౌర హక్కులు, స్వేచ్ఛ, జాతి వివక్ష.. అంశాలు ప్రాధాన్యంగా మారాయి అని అన్నారు.













