డల్లాస్ వాసి నవనీతకృష్ణ ఎయిమ్స్ కు 14న శంఖుస్థాపన
ఆంద్రప్రదేశ్‌కు తమవంతుగా సేవలందిస్తున్న ఎన్నారైల్లో డల్లాస్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు, తానా మాజీ అధ్యక్షుడు డా.గొర్రపాటి నవనీతకృష్ణ ప్రముఖుడు. ఆయన సారథ్యంలో డల్లాస్ పరిసర ప్రాంతాలకు చెందిన కొందరు ప్రముఖుల భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న అమరావతి అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎ.ఎఐ.ఎం.ఎస్)కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం 11 గంటలకు శంఖుస్థాపన చేస్తున్నారు. విజయవాడకు సమీపంలోని ఇబ్రహీంపట్నం సంగమ ప్రదేశానికి సమీపంలో డా.నవనీతకృష్ణ ఆధ్వర్యంలో ఈ ఆసుపత్రి నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నారు. దీనికోసం ప్రభుత్వం కృష్ణా నది ఒడ్డునే 20 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ భూమి రిజిస్టేషన్ పనులు కూడా పూర్తి కావడంతో సీఎం చేతులమీదుగా 14వ తేదీన భూమిపూజ నిర్వహిస్తున్నారు.













