TANA: తానా మహాసభల్లో భగవద్గీత కార్యక్రమం
డెట్రాయిట్‌లోని నోవిలో జరగనున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) మహాసభల్లో ‘కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, గాయకుడు, ప్రవచనకారులు, భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, చైర్మన్ బ్రహ్మశ్రీ డా. ఎల్.వి. గంగాధర శాస్త్రి భగవద్గీతపై ఉపన్యసించనున్నారు. జూలై 5వ తేదీ ఉదయం 10 గంటలకు నిత్య జీవితానికి గీత, ఘంటసాల పాటలు, అన్నమాచార్య కీర్తనలు, విశ్వరూప సందర్శనయోగ వంటి అంశాలతో ఈ కార్యక్రమం జరగనున్నది. ఈ కార్యక్రమానికి అందరూ రావాలని గంగధార శాస్త్రి ఒక ప్రకటనలో కోరారు.







