ట్రంప్ నకు ఇదే నా ఛాలెంజ్
2020 అమెరికా అధ్యక్ష పోటీల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు పోటీగా నిలబడతానని అంటున్నారు అమెరికాకు చెందిన ప్రముఖ రచయిత బ్రాడ్ థార్. అమెరికాలో ట్రంప్‌ను విమర్శించే వారిలో బ్రాడ్ ఒకరు. అధ్యక్ష పోటీల్లో నిలబడతానని బ్రాడ్ వరుసగా ట్వీట్లు గుప్పించడం అగ్రరాజ్యంలో చర్చనీయాశంగా మారింది. పాలనలో మెరుగైన మార్పు లేకపోతే నేను తప్పకుండా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌తో ఛాలెంజ్‌కు దిగుతాను. అగ్రరాజ్యానికి మెరుగైన నాయకుడు కావాలి. అమెరికాకు ఉన్న ఓ ప్రత్యేకత ఏంటంటే నాయకులతో ఛాలెంజ్ చేయగలగడమే కాదు వారితో పోటీ కూడా పడే అవకాశం ఎవరికైనా ఉంటుంది. ట్రంప్ పాలన బాగుంటే మరొకరు ఆయనతో పోటీ పడాలని ఎందుకు అనుకుంటారు? అమెరికా మంచి దేశం కాబట్టి గొప్పగా ఉంది. ఆ గొప్పతనం దేశాన్ని పాలించే నాయకుడితోనూ ఉండాలి అని అన్నారు.













