డొనాల్డ్ ట్రంప్‌పై శాండర్స్దే విజయం!
వచ్చే ఏడాది జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి బెర్నీ శాండర్స్ విజయం సాధిస్తారని తాను విశ్వసిస్తున్నట్లు అమెరికన్ డాక్యుమెంటరీ చిత్ర నిర్మాత, ట్రంప్ విమర్శకుడు, సామాజిక కార్యకర్త మైకేల్ మూర్ చెప్పారు. ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అధికార దుర్వినియోగం, కాంగ్రెస్ కార్యకలాపాలను అడ్డుకోవటం వంటి అభియోగాలతో అమెరికన్ కాంగ్రెస్ ఉభయసభల్లో అభిశంసన ప్రక్రియను ఎదుర్కొంటున్న ట్రంప్ బలహీనతలే ఆయన్ను ఓడిస్తాయని అన్నారు. ట్రంప్‌పై కొనసాగుతున్న అభిశంసన ప్రక్రియ విజయవంతం అయితే శాండర్స్ విజయం సాధించటం తథ్యమని ఆయన సృష్టం చేశారు. శాండర్స్ ట్రంప్‌కు సరైన ప్రత్యామ్నాయమని ఓటర్లు విశ్వసిస్తున్నారని, ఇదే శాండర్స్ విజయావకాశాలను మెరుగుపరుస్తుందని అన్నారు.













