ఎన్నికల ప్రాచారం ప్రారంభించిన శాండర్స్
వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ బెర్నీ శాండర్స్ అభ్యర్థిత్వానికి తాము మద్దతునిస్తామని బొలీవియా అధ్యక్షుడు ఎవో మొరేల్స్ చెప్పారు. 2020 అధ్యక్ష ఎన్నికలకు శాండర్స్‌కు మద్దతివ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన ట్వీట్ చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని శాండర్స్ భావిస్తున్నట్టు మీడియా పేర్కొంటోంది అంటూ మొరేల్స్ తెలిపారు. ప్రగతిశీల భావజాలం కలిగిన ఈ అమెరికన్ రాజకీయ నేతకు అమెరికన్ల మద్దతు లభించగలదని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. ఓట్లతో డెమోక్రాట్లు విఫ్లవం సాధిస్తారని ఆయన ట్వీట్ చేశారు. శాండర్స్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అమెరికాలో రాజకీయ విప్లవానికి అవసరమైన ఆర్థిక సామాజిక న్యాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.













