ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు బే ఏరియావాసుల శ్రద్ధాంజలి
ఇటీవల కాశ్మీర్లో పుల్వామా జిల్లాలో ఉగ్రదాడిలో మరణించిన 49మంది వీరజవాన్లకు బే ఏరియాలోని ఎన్నారైలు శ్రద్ధాంజలి ఘటించారు. అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (ఎఐఎ) ఆధ్వర్యంలో మిల్పిటాస్లోని స్వాగత్ రెస్టారెంట్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఎన్నారైలు పాల్గొని అమరులైన జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. దేశంకోసం జవాన్లు చేస్తున్న త్యాగాలు మరువలేనివని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ మంగిన, భాస్కర్ వల్లభనేని, కొండల్రావు కొమరగిరి, జీవన్, తిరుపతయ్య గండె, రామన్ చెల్లదురై, రజనీకాంత్ కాకర్ల, రమేష్ కొండ, హరి గక్కాని, సాజన్, సుగుణారెడ్డి, రామ్తోట తదితరులు పాల్గొన్నారు.













