కోవిడ్ విపత్తులో కమ్యూనిటీకి బాటా ఆపన్నహస్తం

తెలుగురాష్ట్రాల్లో విజృంభిస్తున్న కరోనా సెకండ్‍వేవ్ కారణంగా ఎంతోమంది ప్రాణాలను కోల్పోతున్న దశలో బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) తనవంతుగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు సహాయపడేందుకు ముందుకు వచ్చింది. నిర్మాణ్ సంస్థతో కలిసి ఈ సహాయాన్ని ఆంధప్రదేశ్‍తోపాటు, తెలంగాణ రాష్ట్రానికి అందిస్తోంది. అవసరమైన చోట బెడ్‍లు, ఆక్సిజన్ సిలెండర్ల ఏర్పాటు, మెడికల్ సిబ్బంది ఏర్పాటు వంటివి ఈ సహాయంలో భాగంగా చేస్తోంది. ఈ సహాయ కార్యక్రమానికి అందరూ తమవంతుగా తోడ్పాటును అందించి విరాళాలు ఇవ్వాలని కోరింది. ఇతర వివరాల కోసం వీరిని సంప్రదించవచ్చు.
విజయ 510 421 3535, హరినాథ్ 650 776 1203, కరుణ్ 408 218 1744, సుమంత్ 408 718 6678, ప్రసాద్ 408 499 653.