కన్సాస్ నగరంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
కన్సాస్ లోని హిందూ టెంపుల్ లో వెయ్యి మందికి పైగా వచ్చిన ఆహుతులతో కన్సాస్ బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. కాన్సాస్ సిటీ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్, తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటీతో కలిసి ఈ బతుకమ్మ వేడుకలను వైభవంగా జరిపారు. కేసిటిసిఎ, టిఎజికెసి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో జానపద బతుకమ్మ ఆట పాటలతో, గౌరి పూజతో అమ్మవారిని కొలిచి బంగారు బతుకమ్మలను పేర్చి కోలాటాలతో సందడిగా సాగాయి.
ముత్యాల పూల పులకరింతలు.. మందార మకరందాలు.. బంతి సింగారాలతో ముస్తాబై.. బతుకమ్మగా పూదొంతరల శిఖరాగ్రాన పూల తో అలంకరించిన 10 అడుగుల బతుకమ్మ మరియు అమ్మవారు విగ్రహం మధ్య కొలువుదీరిన గౌరమ్మను చూసేందుకు వేలాదిమంది తరలివచ్చారు. లలితా సహస్ర నామ పూజతో కార్యక్రమం ప్రారంభమయింది. గాయకురాలు నిహారిక ఒక్కేసి పువ్వేసి సందమామ.. ఒక్క జాములాయే సందమామ.. అంటూ పాడిన పాటలు అందరినీ అలరించాయి. ఈ ఉత్సవాల్లో పిల్లలు పెద్దలు అందరూ పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతిని తెలిపేలా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందని మహిళలు తెలిపారు. తమ సంస్కృతి మరియు సంప్రదాయాన్ని మరచిపోలేదని నిరూపించారు. బతుకమ్మను విశ్వవ్యాప్తం చేయడంపైనా పలువురు మహిళలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ బతుకమ్మ సంబరాలు కి బతుకమ్మ ను తయారు చేసుకొని వచ్చిన మహిళలకు ప్రోత్సాహకరంగా వారికి బతుకమ్మ బహుమతులు ఇవ్వడం జరిగినది మరియు పాల్గొన్న మహిళల కి గిఫ్ట్స్ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమం ముగిసే సరికి శక్తి మరియు అభిరుచితో మహిళలు బతుకమ్మ ఆట పాటలతో కొనసాగించి బాలికలు పాల్గొనడం కాకుండా, పూజ అనంతరము భక్తులందరికీ పూజలో కంకణాలను బట్టి జమ్మి ఆకు(బంగారం) మరియు ఆక్షింతలు ఇతరులకు ఇచ్చి అలై బలై చేసారు. అన్ని కుటుంబాలు జమ్మీని పంచుకోవడం మరియు పెద్దల నుండి అతిధుల నుండి దీనెనను తీసుకున్నారు. బతుకమ్మను సాగనంపే కార్యక్రమాన్ని ప్రత్యక్ష సాంప్రదాయ తెలంగాణ డప్పుసంగీత వాయిద్యంతో ఊరేగింపుగా తీసుకెళ్ళి కొలనులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో సూర్య, సిరి, రవి అయసోల ఇతర వాలంటీర్లు స్వయంగా భోజనాలు వండటం జరిగింది, మృష్టాన్నభోజనాలతో పండుగ ముగిసింది. ఈ కార్యక్రమం జరగటానికి సహకరించి దోహద పడ్డ స్పాన్సర్స్ కి కెసిటిసిఎ, టిఎజికెసి ప్రత్యేకంగా ధన్యవాదములు తెలిపాయి.
శ్రీదేవి గొబ్బూరి, వంశీ సువ్వారి, దుర్గా తెల్ల, కిరణ్ కనకదండిల, గార్ల అద్యక్షతన మరియు ఇతర KCTCA కార్యవర్గ సభ్యులు సరిత మద్దూరు, సూర్య జగడం, సందీప్ మందుల, సుష్మ చాడ, సరళ కొత్త, జయ కనకదండిల, బిందు చీదెళ్ల, రాజ్ చీదెళ్ల, నీలిమ పూండ్ల, సునీల్, విశ్వా అమ్ముల, వాసు తలగడదీవి, వెంకట్ రావ్, వెంకట్ మండ, మరియు TAGKC కార్యవర్గ సభ్యులు నరేందర్ దుద్దెల, చంద్ర యక్కాలి, సరిత రాయన్నగారి, మధు గంట, శ్రావణి మేక, ప్రశాంత్ ఠాకుర్, విజయ్ రాగిని, శ్రీని పెనుగొండ, శివ తియాగుర, శరత్ టేకులపల్లి, సతీష్ మీసా, శ్రీనుకుమార్ గాడిరాజు, మరియు పద్మజ సరిపల్లి, సిరి తుమ్మ, రవి అయసోలా, రూప బసు, విజయ్ కొండి, సుచరిత వాసం గార్ల సహకారంతో మరియు 50 మంది ఇతర వలంటీర్ల సమిస్టి కృషితో ఈ కార్యక్రమం అద్భుతం గా జరిగింది.













