Canada: కెనడాలో తెలంగాణా డెవలప్‌మెంట్ ఫోరమ్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు

తెలంగాణా సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పడుతూ కెనడాలో (Canada) బతుకమ్మ (Bathukamma) పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణా డెవలప్‌మెంట్ ఫోరమ్ కెనడా (TDF) ఆధ్వర్యంలో టోరంటోలోని బ్రాంప్టన్ నగరంలో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ బతుకమ్మ (Bathukamma) వేడుకకు ప్రవాస తెలుగు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో ఎన్ఆర్‌ఐలు తమ కుటుంబాలతో కలిసి వచ్చి ఈ వేడుకల్లో ఉల్లాసంగా ఆడిపాడారు.
టీడీఎఫ్ (TDF) నిర్వాహకులు ఈ వేడుకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు, పసందైన తెలంగాణా వంటకాలతో కూడిన భోజనాలను కూడా అందించారు. కెనడాలో (Canada) పుట్టి పెరిగిన తెలుగు పిల్లలకు మన పండగల ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని టీడీఎఫ్ (TDF) ప్రతినిధులు తెలిపారు. 21 ఏళ్లుగా ఈ బతుకమ్మ (Bathukamma) సంబరాలను విజయవంతం చేయడంలో పాలుపంచుకున్న అందరికీ టీడీఎఫ్ (TDF) కెనడా కమిటీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసింది.
ఈ వేదికపై గంటా రెడ్డి మాణిక్ రెడ్డి స్మారక విశేష సేవా పురస్కారాన్ని మహేష్ మాదాడి, రజిని దంపతులకు టీడీఫ్ (TDF) కెనడా కమిటీ తరఫున అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీఫ్ (TDF) కెనడా ప్రెసిడెంట్ జితేందర్ రెడ్డి గార్లపాటి, ఫౌండేషన్ కమిటీ చైర్మన్ సురేందర్ పెద్ది, అమితా రెడ్డితో పాటు టీడీఫ్ కెనడా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బతుకమ్మ (Bathukamma) సంబరాలు విజయవంతంగా ముగియడంతో, టీడీఎఫ్ కమిటీ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసింది.