జీటీఏ కృషి ఫలితం.. అట్లాంటాలో బతుకమ్మకు ప్రత్యేక గుర్తింపు
అమెరికాలోని అట్లాంటా నగరంలో తెలంగాణ పండుగ ‘బతుకమ్మ’కు ప్రత్యేక గౌరవం దక్కింది. బతుకమ్మకు ప్రత్యేక గుర్తింపునిస్తూ అట్లాంటా స్టేట్ ప్రకటన చేసింది. ఇదంతా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్-అట్లాంటా (జీటీఏ) కృషితోనే సాధ్యమైందని జీటీఏ ప్రతినిధులు పేర్కొన్నారు. అలాగే జీటీఏకు అండగా నిలిచిన స్పాన్సర్స్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఏటా జీటీఏ ఆధ్వర్యంలో జరిగే బెగా బతుకమ్మ సంబరాల ప్రకటనను కూడా జీటీఏ విడుదల చేసింది. అక్టోబరు 5వ తేదీన జరిగే ఈ వేడుకలకు అమెరికా ప్రధమ మహిళ జిల్ బైడెన్ను ఆహ్వానించినట్లు జీటీఏ వెల్లడించింది. గతేడాది జరిగిన మెగా బతుకమ్మ సంబరాల్లో 5 వేలమందికిపైగా పాల్గొన్నారని, ఈ ఏడాది మరింత మంది ఈ వేడుకల్లో పాల్గొనాలని పిలుపునిచ్చింది.







