ఘంటసాల, సావిత్రి, సిరివెన్నెల పాటలతో మధురంగా సాగిన బాటా ‘పాడాలని వుంది’
బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) కరవొకె కార్యక్రమం నిర్విరామంగా గత 12 సంవత్సరాలుగా జరుగుతోంది. డిసెంబర్ 11వ తేదీన అమరగాయకుడు ఘంటసాల, మహానటి సావిత్రిని స్మరించుకుంటూ ‘పాడాలని వుంది’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అలాగే ఇటీవల మరణించిన రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళులు అర్పిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంతోమంది గాయనీ గాయకులు పాల్గొని వారు రాసిన పాటలను పాడారు.
బాటా అడ్వయిజర్ ప్రసాద్ మంగిన తొలుత అందరికీ స్వాగతం పలికి అతిధులను పరిచయం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన అతిధులు ఘంటసాల, సావిత్రి, సిరివెన్నెలతో తమకు ఉన్న అనుబంధాన్ని అందరితోనూ పంచుకున్నారు. మహామహులను స్మరించుకుంటూ, నేటితరానికి వారి గురించి తెలియజేసేలా బాటా ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేసి బాటా టీమ్‌ను అభినందించారు. సతీష్ గణేశన్ తన తల్లి సావిత్రితో ఉన్న అనుబంధాన్ని తెలిపారు. వేణు ఆసూరి సిరివెన్నెల భాషా వైభవాన్ని తెలియజేశారు. వేణు శ్రీరంగం కూడా సిరివెన్నెల మృతితో టాలీవుడ్ మంచి రచయితను కోల్పోయిందన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు పాటలు పాడారు. త్రినాధరావు ఆలయాన వెలసిన పాటను, విజయ గోపరాజు సఖియా వివరించెవా పాటను, అనిక ప్రసాద్ అహ నా పెళ్ళిఅంట పాటను, సతీష్ గణేషన్ సావిత్రి హిట్స్ పాటలను, వేణు శ్రీరంగం నిన్న లేని అందం, గుండెల్లో ఏముందో పాటలను, కృష్ణ రాయసం ఆనతీనీయరా హరా పాటను, మురళి నా చెలియా, అక్షిత ఈ క్షణం ఒకే ఒక కోరిక పాటను, మురళి గండ్లూరు బహుదూరపు బాటసారి పాటను, శేష ప్రసాద్ వగలరాణివి నీవే పాటను, ప్రసాద్ బి విధాత తలపున పాటను, మురళి సంబర ఆదిభిక్షువు పాటను, నవీన్ నా హృదయంలో నిదురించే చెలి, తరలిరాధ పాటలను, మానస గాదేపల్లి తెలుసునా పాటను, శ్రీదివ్య స్టాండప్ కామెడీ, ప్రసాద్ మంగిన జగమే మారినది, సంజన సీతమ్మ అందాలు, సంజన బి ఓ చెలి క్షమించ మన్నవుగా పాటను పాడారు.
List of singers / performers:
Trinadh Rao – Aalayana Velisina
Vijaya GopaRaju – Sakhiya Vivarinchave
Anika Prasad – Aha Na Pellianta
Satish Ganesan – Medley of Savitri hits
VenuSrirangam – Ninnaleni Andham edo & Gundello Emundo
Krishna Rayasam – Anatineeyara Haraa
Srini Tagirisa – Aligithiva sakhiPriya
Murali P – Naacheliya
Akshita – EeKshnam Oke Oka Korika
Murali Gandluru – Bahudoorapu Baatasari
Shesha Prasad – Vagalaraanivi Neeve
PrasadB- Vidhata Talapula
Murali Sambara – Adibhikshuvu
Naveen Patlola-NaaHrudayamlo Nidurinche Cheli & Tarali Radha
Manasa Gadepalli- Telusuna Telusuna
SriDivya – StandUp Comedy
Prasad Mangena-Jagame Maarinadi
SanjanaT – Seetamma Andalu
SanjanaB – Oh Cheli Kshmincha MannavuGaa
బాటా టీమ్ – హరనాథ్ చికోటి (అధ్యక్షుడు), కొండల్ రావు (వైస్ ప్రెసిడెంట్), అరుణ్ రెడ్డి, వరుణ్ ముక్క, శివ కడ.
స్టీరింగ్ కమిటీ సభ్యులు – రవి తిరువీధుల, కామేష్ మల్ల, శిరీష బత్తుల, యశ్వంత్ కుదరవల్లి, సుమంత్ పుసులూరి, కల్చరల్ డైరెక్టర్స్ ` శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, తారక దీప్తి.
నామినేటెడ్ కమిటీ – హరి సన్నిధి, సురేష్ శివపురం, శరత్ పోలవరపు, సంకేత్, సందీప్.
యూత్ కమిటీ సభ్యులు – ఆదిత్య, హరీష్, ఉదయ్, క్రాంతి
బాటా అడ్వయిజరీ బోర్డ్ నాయకులు జయరామ్ కోమటి, విజయ ఆసూరి, వీరు ఉప్పల, ప్రసాద్ మంగిన, కరుణ్ వెలిగేటి, రమేష్ కొండ, కళ్యాణ్ కట్టమూరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు బాటా టీమ్‌ను అభినందించారు.
ఈ కార్యక్రమంలో పాటలు పాడిన గాయనీగాయకులను అందరూ అభినందించారు.













