శాంతాక్లాజ్ అవతారమెత్తిన ఒరాక్ ఒబామా
అమెరికా మాజీ అధ్యక్షుడు ఒరాక్ ఒబామా సామాజిక కార్యకలాపాల్లో చాలా చురుకుగా ఉంటారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి సామాజిక సమస్యల పట్ల అవగాహన కల్పిస్తూ ఉంటారు. క్రిస్మస్ సమీపిస్తుండటంతో వాషింగ్టన్లోని ఓ చిన్న పిల్లల ఆసుపత్రికి వెళ్లి అక్కడి పిల్లలకు సర్ప్రైజ్ ఇచ్చారు. శాంతాక్లాజ్ టోపి పెట్టుకుని వాళ్ల వద్దకు వెళ్లి కాసేపు వారితో సమయం కేటాయించారు. ప్లిలలతో ఆటలాడారు. పాటలు పాడారు. ఆసుపత్రికి వచ్చేటప్పుడు పిల్లలకు క్రిస్మన్ కానుకలను తీసుకొచ్చారు. కానుకల సంచిని భుజాన వేసుకుని ఒబామా నడుచుకుంటూ వస్తున్న ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. అద్భుతమైన, అందమైన పిల్లలతో ఆడుకునే అవకాశం నాకు కల్పించిన ఆసుపత్రికి యాజమాన్యానికి ధన్యవాదాలు. వారి ముఖాల్లో నవ్వు ఎప్పుడూ ఇలాగే ఉండాలి అని ఒబామా చెప్పుకొచ్చారు. పిల్లలతో అక్కడ ఒబామా గడిపిన తీరును చిల్డ్రన్ నేషనల్ అనే సంస్థ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫొటోలు, వీడియో వైరల్ అవుతున్నాయి. పిల్లల పట్ల ఒబామా చూపిన ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఒబామాను మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.













