పట్టీతో జలుబుకు చెక్
ప్లూ, జలుబులను నయంచేసే పట్టీలను పరిశోధకులు తయారు చేశారు. మన రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు ఈ రెండూ ఎక్కువగా చుట్టుముడతాయి. వీటిపై ఇన్ప్లూఎంజా సూది మందు చక్కగా పనిచేస్తుంది. అయితే ఈ సూదిని చూసి పిల్లలతోపాటు పెద్దలూ జంకుతుంటారు. దీనికి ప్రత్యామ్నాయంగా అమెరికాలోని జార్జీయా సాంకేతిక విద్యా సంస్థ, ఎమోరీ వర్సిటీ నిపుణులు తాజా పట్టీని తయారుచేశారు. దీనిపై వెంట్రుకల కంటే సన్నని 100 సూక్ష్మ సూదులున్నాయి. పట్టీని చర్మంపై అతికించుకోగానే ఇవి ఔషధాన్ని శరీరంలోకి పంపిస్తాయి. దీన్ని కేవలం 20 నిమిషాలపాటు అంటించుకుంటే చాలట. పైగా ఎలాంటి నొప్పీ ఉండదని పరిశోధకులు చెబుతున్నారు. దీని సాయంతో రోగ నిరోధక శక్తీ మెరుగైనట్లు వారు వివరించారు.













