ఆటాలో భద్రాచల సీతారాముల కళ్యాణం
ఆటా మహాసభల్లో జూన్ 9వ తేదీన ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు భద్రాచల శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఏర్పాటు చేసినట్లు కాన్ఫరెన్స్ ఆధ్యాత్మిక కమిటీ ప్రకటించింది. జిడబ్ల్యుసిసి హాల్లోని సి రూమ్‌లో ఈ కళ్యాణ మహోత్సవం జరగనున్నది. ఈ కళ్యాణ మహోత్సవానికి వ్యాఖ్యాతగా శృంగేరి శారదాపీఠ ఆస్థాన పౌరాణికులు, ప్రవచన నిధి, పౌరాణిక ప్రవర డా. బాచంపల్లి సంతోష్ కుమార శాస్త్రి వ్యవహరించనున్నారు. ఆధ్యాత్మిక కమిటీకి చైర్‌గా డా. ప్రసాద్ గరిమెళ్ళ, అడ్వయిజర్‌గా రంగారావు సుంకర, కో చైర్ లుగా నిరంజన అల్లమనేని, సురేష్ గాదిరాజు, నీలిమ బుదిమ్, శివరామడుగు, వంశీ యాదవేణి, వెంకట్ గొల్లపూడి, దేవి రామమూర్తి, కృష్ణ కొనకండ్ల, పద్మజ కొత్తపల్లి, శేష్ మారెళ్ళపూడి ఉన్నారు.







