TTA: టిటిఎ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజయవంతం
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) ఛార్లెట్ చాప్టర్ ఆధ్వర్యంలో విజయవంతంగా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ (badminton tournament) ను నిర్వహించారు. అధ్యక్షుడు నవీన్ రెడ్డి మల్లెడ్డి గారి డైనమిక్ నాయకత్వంలో ఈ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో విశేషంగా కృషి చేసిన నిఖిత జూలకంటి (ఆర్గనైజింగ్ మెంబర్), మహేష్ గుండెటి (స్పోర్ట్స్ కమిటీ చైర్), నిశాంత్ సిరికొండ (జాయింట్ సెక్రటరీ), శ్రీకాంత్ గాలి (హెల్త్ %డ% వెల్నెస్ అడ్వైజర్), అభిలాష్ ముదిరెడ్డి (బోర్డ్ ఆఫ్ డైరెక్టర్), నరేంద్ర దేవరపల్లి (బోర్డ్ ఆఫ్ డైరెక్టర్), పల్లవి రెడ్డి రామిడి (ఉమెన్స్ ఫోరమ్ అడ్వైజర్) మరియు అద్భుతమైన ఆర్విపిలు, ఛార్లెట్ టీమ్‌లోని ప్రతి ఒక్కరికీ ప్రత్యేక అభినందనలు. వారి అంకితభావం మరియు కృషి ఎంతో ప్రశంసనీయం.
ఈ టోర్నమెంట్లో పాల్గొన్న క్రీడాకారులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మరియు విజేతలకు టిటిఎ అధినాయకత్వం శుభాకాంక్షలు తెలియజేసింది.








