శిశువును మింగిన కరోనా వైరస్
కరోనా వైరస్‌తో శిశువు మరణించిన సంఘటన అందరినీ కలిచివేసింది. అమెరికాలోని ఇల్లినాయిలో శనివారం ఈ శిశువు మరణించిందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. కోవిడ్-19 కారణంగా నవజాత శిశువు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇదే మొదటిసారి అని ఆరోగ్యశాఖ డైరెక్టర్ న్గోజీ ఎజైక్ తెలిపారు. శిశువు మృతికి గల కారణాలు తెలుసుకొనేందుకు పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నామని ఆయన స్పష్టం చేశారు. దీనిపై గవర్నర్ జేబీ ప్రీట్జ్కర్ మాట్లాడుతూ.. ఈ వార్త తనను కుదిపేసిందని అన్నారు. గడిచిన 24 గంటల్లో కరోనా సోకిన వారిలో ఈ శిశువు కూడా ఉందని ఆయన తెలిపారు. ‘‘ఓ చిన్నారి మృతి చెందిందనే వార్త వినడం ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసు. ముఖ్యంగా ఓ నవజాత శిశువు కుటుంబానికి ఇది భాదాకరమైనదన్నారు.













