అమెరికాలో భారతీయులే నంబర్ వన్!
ప్రపంచ దేశాల్లోని పలవురు విద్యార్థులు, ఉద్యోగ, వ్యాపారులకు అమెరికా వెళ్లాలన్నది కల. దాన్ని నెరవేర్చుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదు. కానీ, వెళ్లిన వారిలో అంతా ఆర్థికంగా స్థితిమంతులు కాలేరు. భారతీయులు మాత్రం ఆదాయంలో ఎక్కడా తగ్గడం లేదు. వివిధ దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడుతున్న వారిలో భారతీయుల సగటు ఆదాయం అందరికంటే అధికంగా ఉండటం.. వివిధ రంగాల్లో మనోళ్లకున్న ప్రతిభాపాటవాలకు నిదర్శనం. ఏటా అక్కడి ప్రభుత్వం అమెరికన్ కమ్యూనిటీ సర్వే నిర్వహిస్తుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నివసిస్తున్న స్థానికులు, విదేశీయుల మధ్యస్థ (మధ్య తరగతి) కుటుంబాల ఆదాయ వివరాలు నమోదు చేస్తుంది. అందులో వివిధ దేశాల నుంచి వచ్చినవారి గణాంకాలు పొందుపరుస్తారు.
ఈ వివరాల ప్రకారం అక్కడ స్థిరపడ్డ ఇండియన్ అమెరికన్ల ఆదాయం ఏటా అందరికంటే 1,00,500 డాలర్లుగా నమోదైంది. పొరుగు దేశాలైన శ్రీలంక నాలుగు, చైనా ఏడు, పాకిస్థాన్ ఎనిమిదో స్థానంలో నిలిచాయి. మొత్తం టాప్ 10 దేశాల్లో తొమ్మిది ఆసియా దేశాలే కాగా, స్థానికులు ఏకంగా 9వ స్థానంలో నిలవడం విశేషం.
బ్యాచ్‌లర్ డిగ్రీలోనూ మనమే..
భారతీయులు బుద్ధిమంతులే కాదు, విద్యావంతులు కూడా. అమెరికాలో స్థిరపడుతున్న విదేశీయుల్లో బ్యాచ్‌లర్ డిగ్రీ ఉన్న వారిలోనూ ఇండియన్లే నంబర్‌వన్ ఈ విషయంలో అమెరికన్లు 28 శాతంతో అఖరిస్థానంలో నిలవడం గమనార్హం.













