ఆస్ట్రేలియాలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యులు టి.ప్రకాష్ గౌడ్ కు ఘనస్వాగతం
ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం (ఏటీఫ్) ఆధ్వర్యంలో జూన్ 2nd జరగనున్నా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు పాల్గొనేందుకు అడుగుపెట్టిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యులు శ్రీ..ప్రకాష్ గౌడ్ కు సిడ్నీలో ఘనస్వాగతం లభించింది. శుక్రవారం సాయంత్రం సిడ్నీలోని కింగ్స్ఫోర్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శ్రీ. టి.ప్రకాష్ గౌడ్ కు ఆస్ట్రేలియా తెలంగాణ ఫోరమ్ సభ్యులు వారితో పాటు వివిధ తెలంగాణ మరియు ఆస్ట్రేలియ సంస్థలప్రతినిధులు, తెలంగాణ ఎన్నారైలు పెద్ద సంఖ్యలో హాజరై ఘన స్వాగతం పలికారు. ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం అధ్యక్షులు అశోక్ మాలిష్, ముఖ్య కార్యదర్శి ప్రదీప్ సేరి మర్యాద పూర్వకంగా స్వాగతించారు.
ఈ కార్యక్రమంలో ఏటీఫ్ సభ్యులు గోవెర్దన్ రెడ్డి, వాసు తాట్కూర్ ప్రశాంత్ కడపర్తి, డేవిడ్ రాజు, కిషోర్ పంతులు, నటరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా అధికారిక మీడియా ప్రతినిధి ప్రశాంత్ కడపర్తి మాట్లాడుతూ ఆస్ట్రేలియాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు తెలంగాణ నుండి రాష్ట్ర శాసనసభ్యులు శ్రీ. టి.ప్రకాష్ గౌడ్ గారు మరియు తెరాస డిస్ట్రిక్ట్ పార్టీ సెక్రటరీ P.చంద్రశేఖర్ రెడ్డి గారు, రాజేంద్రనగర్ మండల్ ఎంపీపీ ట్. మల్లేష్ గారు రావడం చాల ఆనందకంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఆస్ట్రేలియా లో నిర్వయించడం గర్వకారణంగా ఉందన్నారు.













