ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరమ్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ అవతరణ వేడుకలు ..!!
ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరమ్ ఆధ్వర్యంలో – సిడ్నీలో అంగరంగ వైభవంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా జరిగాయి, మల్టీ కల్చరల్ నైట్ పేరుతో ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు..!!
పలురంగాల తెలుగు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి, భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే పలు నృత్య ప్రదర్శనలు కార్యక్రమాలు జరిగాయి. మన సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్తు తరానికి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఇటు వంటి కార్యక్రమాలు దానికి ఎంతో సహకరిస్తాయి అని విచ్చేసిన ఆస్ట్రేలియన్ రాజకీయ ప్రముఖులు కొనియాడారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరమ్ సభ్యులు పలు రంగాలలో సేవలు అందిస్తున్న తెలుగు, తమిళ, ఆస్ట్రేలియన్ సేవారంగం ప్రముఖులను సత్కరించి గౌరవించారు.
ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరమ్ అధ్యక్షులు ప్రశాంత్ కడపర్తి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం జనాదరణ పెరుగుతూ సిడ్నీ నగరంలో మంచి కార్యక్రమాలకు ప్రజల ఆదరణ ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుందని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను పాటిస్తుండటం, ఇక్కడే పుట్టి పెరిగిన పిల్లలకు కూడా తెలంగాణ సంస్కృతిని తెలియజెప్పడమే సంస్థ ముఖ్య ఉదేశ్యంని తెలిపారు ఈ బహు సంస్కృతి కార్యక్రమం అందుకు నిదర్శనమని గుర్తుచేశారు.
స్థానిక బౌమాన్ హాల్ బ్లాక్టౌన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నంచి దాదాపు 1500 మంది హాజరయ్యారు.
మినిస్టర్ జాఫ్ లీ కోవిద్ తర్వతా ఆయన పాల్గొన్న అతి పెద్ద కార్యక్రమం ఇదేనని ఈ వేడుక నభూతో నభవిష్యతిలా ఉందని చెప్పారు..
ఎక్స్ అప్పోజిషన్ లేబర్ లీడర్ జోడి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడి 8 ఏళ్ళు అయ్యింది అని, ఆ రాష్ట్ర ఏర్పాటు ప్రజల నిజమైన రిపబ్లిక్ ఆకాంక్షను ప్రతిబింబిస్తుంది అని గుర్తుచేశారు…
ఎంపీ జూలియా ఫిన్ మాట్లాడుతూ ఈ కిక్కిరిసిన ఈ కార్యక్రమ తెలంగాణ ప్రజల సంస్కృతి పై ప్రేమలా అందంగా ఉందని చెప్పారు.
కౌన్సిలర్ లివింగ్స్టన్ గారు మాట్లాడుతూ వారి బాధ్యతలు తెలుగు ప్రజల సహకారంతో మరింత మెరుగ్గా నిర్వహిస్తానని తెలియజేశారు.
ఇండియన్ కౌన్సలర్ – సంజయ్ ములక గారు మాట్లాడుతూ ఇటు వంటి కార్యక్రమాలు వారి మాతృదేశాన్ని ఇక్కడే చూస్తున్న ఆనందం ఇచ్చింది అని చెప్పారు.
విదేశాల్లో ఉంటూ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుతున్న ఎన్నారైల కృషి ఎనలేనిదని, తెలంగాణ ఎన్నారైలు వేల మైళ్ల దూరంలో ఉంటున్నా మనససంతా తెలంగాణపైనే ఉంటుందన్నారు. గోవర్ధన్ రెడ్డి ముద్దం ( జనరల్ సెక్రటరీ) అన్నారు.
ఈ కార్యక్రమం నిర్వాహకులు
EC Team ( ప్రశాంత్ కడపర్తి ప్రెసిడెంట్/ వాణి ఏలేటి (వైస్ ప్రెసిడెంట్) గోవర్ధన్ రెడ్డి ముద్దం (జనరల్ సెక్రటరీ) వినయ్ కుమార్ యమా (ట్రెజరర్) అశోక్ మాలిష్ (పబ్లిక్ ఆఫీసర్), విద్య రెడ్డి సేరి – కల్చరల్ సెక్రటరీ మల్లిఖార్జున్ అవిరేణి (EC)
ముఖ్య అతిధులు :
ఎంపీ జూలియా ఫిన్
మినిస్టర్ జాఫ్ లీ
ఇండియన్ కౌన్సలర్ – సంజయ్ ములక
జోడీ మకేయ్ (ఎక్స్ అప్పోజిషన్ లేబర్ లీడర్)













