అమెరికా మార్కెట్లోకి అరబిందో ఔషధం
మరో ఔషధాన్ని అమెరికా మార్కెట్లో విక్రయించడానికి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) నుంచి అరబిందో ఫార్మా అనుమతి పొందింది. రక్తంలో పొటాషియం తగ్గినప్పుడు వినియోగించే పొటాషియం క్లోరైడ్ బిళ్లల తయారీ, విక్రయానికి యూఎస్ఎఫ్డీఏ నుంచి అనుమతి పొందామని కంపెనీ తెలిపింది. 600 ఎంజీ, 750 ఎంజీ మైతాదుల్లో ఈ బిళ్లలను అమెరికా మార్కెట్లో విక్రయిస్తుంది. క్లార్-కాన్ బ్రాండ్ ఆప్షీర్-స్మిత్ విక్రయిస్తున్న ఎక్స్టెండెడ్ రిలీజ్ బిళ్లలకు అరవిందో జనరిక్ను ప్రవేశపెడుతోంది. వచ్చే నెలలో అరబిందో బిళ్లలు అమెరికా మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. 2018 అక్టోబరుతో ముగిసిన 12 నెలలకు అమెరికాలో ఈ ఔషధాల అమ్మకాలు 6 కోట్ల డాలర్ల మేరకు ఉన్నాయి.













