ATA: స్టార్టప్‌లను ఆటా ప్రోత్సహించడం అభినందనీయం
- హాజరైన పలువురు ఐటీ ప్రముఖులు
- అంతర్జాతీయ వేదికగా ఆటా స్టార్టప్ పిచ్ డే
- ఐఐటీ హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహణ
కంది, సంగారెడ్డి: ఐటీ రంగంలో స్టార్టప్ కంపెనీలను అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా) ప్రోత్సహించడం అభినందనీయం అని పలువురు ఐటీ రంగ ప్రముఖులు కొనియాడారు. శనివారం అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న ‘ఆటా వేడుకలు–2025’లో భాగంగా ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ (విద్యాశాఖ), ఐఐటీ హైదరాబాద్ సహకారంతో హైదరాబాద్ ఐఐటీ క్యాంపస్‌లోని కన్వెన్షన్ సెంటర్ ఆడిటోరియంలో ఆటా స్టార్టప్ పిచ్ డే కార్యక్రమంలో స్టార్టప్ వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు, విద్యా సంస్థలు, ఐటీ రంగ నిపుణులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టింది. స్టార్టప్‌లను ప్రోత్సహించడం, వాటికి నిధులు, దిశ నిర్దేశం అందించడం, గ్లోబల్ నెట్‌వర్క్‌ను నిర్మించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఆటా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామసహాయం రెడ్డి, ఇతర ప్రతినిధులు పాల్గొనగా, ముఖ్య అతిథిగా మైతీ స్టార్టప్ హబ్ (ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ) సీఈఓ డా. పన్నీర్ సెల్వం (పీఎస్) మదనగోపాల్ హాజరై మాట్లాడుతూ, దేశంలో స్టార్టప్ ఎకోసిస్టం వేగంగా విస్తరిస్తోందని, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలు, మైతీ స్టార్టప్ హబ్ అందిస్తున్న సహకారం వల్ల యువ ఇంజినీర్లకు అనేక అవకాశాలు లభిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. టెక్నాలజీ ఆధారిత ఆవిష్కరణలే భవిష్యత్ ఆర్థిక వృద్ధికి పునాదని స్పష్టం చేశారు. అలాగే ఏఐ కూడా భవిష్యత్‌కు నూతన నాంది పలుకుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్కేలింగ్ స్టార్టప్స్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ అనే అంశంపై జరిగిన ప్యానెల్ చర్చ ఆకట్టుకుంది. ఈ చర్చలో డా. పన్నీర్ సెల్వం మదనగోపాల్తో పాటు ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్, కో–ఇన్నోవేషన్ అండ్ హెడ్ ఆఫ్ రీసెర్చ్/ఇన్నోవేషన్ అవుట్‌రీచ్ రమేష్ లోగనాథన్, సునేరా గ్రూప్ వ్యవస్థాపకుడు రవి రెడ్డి, డల్లాస్ వెంచర్ క్యాపిటల్ భాగస్వామి కిరణ్ చంద్ర కళ్లూరి, ఐఐటీ హైదరాబాద్ మెటీరియల్స్ సైన్స్ ప్రొఫెసర్ ముద్రిక ఖండేల్వాల్ పాల్గొన్నారు.
హాజరైన వారు ఎవరంటే..
పిచ్ డేలో పాల్గొన్న స్టార్టప్‌లు తమ వ్యాపార ఆలోచనలు, ఉత్పత్తులు, సేవలను కాంపిటీషన్ న్యాయనిర్ణేతలు రవి రెడ్డి, కిరణ్ తనికెళ్ల, కిరణ్ చంద్ర కళ్లూరి, శ్రీధర్ రంపల్లి, రాజేష్ కోసూరి, రఘురామన్ రామమూర్తి, పార్థ సారధి కరంసెట్టి, జీవన్ కరంసెట్టి, ప్రసాద్ వడ్డాది, వెంకటేశం బి, భారవి కొడవంటి, వేను మాధవ్ వొడ్నాలకు వివరించగా, వారు ఉత్తమ స్టార్టప్‌లను ఎంపిక చేశారు. ఈ సెమినార్ ను ఉద్దేశించి ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామసహాయం రెడ్డి మాట్లాడుతూ, పవర్‌హౌస్, పేవ్‌స్టోన్, సక్సీడ్ ఇన్నోవేషన్, డల్లాస్ వెంచర్ క్యాపిటల్ సంస్థలు పూర్తి సహాయ సహకారాలు అందించాయని వారికి ధన్యవాదాలు తెలిపారు. ఉత్తమ స్టార్టప్‌లకు నిధుల అవకాశాలు, మెంటార్షిప్, పరిశ్రమల అనుసంధానం కల్పించడమే లక్ష్యంగా ఈ పిచ్ డే నిర్వహించామని తెలిపారు. భారతదేశం–అమెరికా మధ్య స్టార్టప్ సహకారాన్ని మరింత బలోపేతం చేయడంలో ఆటా స్టార్టప్ పిచ్ డే కీలక మైలురాయిగా చరిత్రలో నిలుస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆటా బోర్డు ఆఫ్ ట్రస్టీలు, కో చైర్ నరసింహ ద్యాసాని, సాయి సూదిని, శ్రీకాంత్ గుడిపాటి, ఆటా కాన్ఫరెన్స్ కన్వీనర్ శ్రీధర్ బాణాల, బోర్డు ఆఫ్ ట్రస్టీ కాశీ కొత్త, రామకృష్ణ అల, శ్రీధర్ తిరిపతి, మాజీ అధ్యక్షులు పరమేష్ భీమ్ రెడ్డి, బిజినెస్ చైర్ హరీష్ బత్తిని, రఘువీర్ మర్రిపెద్ది, వినోద్ కోడూరు, కిషోర్ గూడూరు, నర్సి రెడ్డి, విష్ణు మాధవరం, సుమ ముప్పల, తిరుమల్ రెడ్డి, రాజ్ కరకల, వేణు నక్షత్రం, లక్ష్ చేపూరి, సుమన్ బర్ల, వేణుగోపాల్ సంకినేని, మీడియా సలహాదారు ఈశ్వర్ బండా తదితరులు పాల్గొన్నారు.






