అమెరికా ఆహ్వానం…తిరస్కరించిన వాజ్ పేయీ
కార్గిల్ యుద్ధం జరుగుతున్న సమయంలో పరిస్థితి తీవ్రతను గమనించిన అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్ అప్పటి పాక్‌ప్రధాని నవాజ్‌షరీఫ్‌ను వాషింగ్టన్కు హుటాహుటిన పిలిపించారు. భారత్‌కు పోన్ చేసి వాజ్‌పేయీకీ ఆహ్వానం పలికి షరీఫ్‌తో ముఖాముఖి చర్చలకు రమ్మని కోరారు. అయితే వాజ్‌పేయీ ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు. తాము పాక్‌తో యుద్దానికి దిగలేదని పాక్ సైన్యమే భారత భూభాగంలోకి ప్రవేశించి తిష్టవేయడంతో సైనిక చర్య ప్రారంభించినట్టు సృష్టం చేశారు. పాక్ సైన్యం బేషరతుగా భారత భూభాగం నుంచి వెనక్కి వెళ్లాలని ఆయన కోరారు. అప్పటికే పాక్ దురాక్రమణపై వివరాలను క్లింటన్ అందుకున్నారు. వెంటనే షరీఫ్‌కు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు అప్పటికే పాక్ తీవ్రంగా నష్టపోవడంతో పాక్ సైన్యం తోకముడిచి వెనక్కు మళ్లింది.













