ఐరాసలో తొలి హిందీ ప్రసంగం ఆయనదే
ఐరాస సర్వప్రతినిధి సభలో హిందీలో ప్రసంగించిన తొలి భారత నాయకుడు వాజ్పేయీనే. ఐరాసలో వాజ్పేయీ ప్రసంగాలన్నీ హిందీలోనే సాగాయి. తొలిసారిగా ఈ వేదికపై ఆయన 1977లో ప్రసంగించారు. అప్పుడు జనతపార్టీ ప్రభుత్వంలో వాజ్పేయీ విదేశాంగ మంత్రిగా ఉన్నారు. ఐరాసకు నేను కొత్తేమో గానీ, భారత్ కొత్త కాదు. ఆరంభం నుంచీ సంస్థతో భారత్కు అనుబంధం ఉంది అంటూ ఆయన అప్పుడు మాట్లాడారు. ప్రపంచమే ఓ కుటుంబమన్నది అనాదిగా భారతీయుల విశ్వాసమని చెబుతూ, వసుధైక కుటుంబ సూత్రాన్ని అందరికీ వివరించారు. పాకిస్థాన్లో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని భారత్ ఆశిస్తోందని చెప్పారు. 1978లో మరోసారి మాట్లాడారు. అనంతరం 1998, 2000, 2001, 2002, 2003ల్లోనూ ఐరాసాలో వాజ్పేయీ ప్రధాని హోదాలో ప్రసంగాలు చేశారు.













