యువత కోసం ఆటా యూత్ కొలంబస్ క్రికెట్ పోటీలు

అమెరికన్ తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు జరగనున్నాయి. లీస్‌బర్గ్ వేదికగా జరిగే యూత్ కొలంబస్ డే క్రికెట్ టోర్నమెంట్‌లో యువ టీమ్స్ పాల్గొనాలని ఆటా కోరుతోంది. అండర్-11, అండర్-13, అండర్-15 విభాగాల్లో అబ్బాయిలు, అమ్మాయిలకు వేరు వేరుగా ఈ పోటీలు జరుగుతాయి. అక్టోబర్ నెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగే ఈ పోటీలను టీ20 ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. ఈ టోర్నమెంట్ నిర్వహించేందుకు డబ్ల్యూసీఏ, డబ్ల్యూఎంసీఎల్‌తో ఆటా చేతులు కలిపింది. ఈ పోటీల్లో పాల్గొనాలని అనుకునేవారు https://forms.gle/F68cpMNSxk5r3hth8 లింకులో రిజిస్టర్ చేసుకోవచ్చు.