శాన్ఫ్రాన్సిస్కో నూతన కాన్సులేట్ జనరల్ ని అభినందించిన ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా, ట్రస్ట్ బోర్ద్ సభ్యులు రిండ సామ మరియు కమ్యునిటి లీడర్ వినోద్ నాగి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నూతన కాన్సులేట్ జనరల్‌గా నియమితులైన డాక్టర్ శ్రీకర్ కె రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలియచెసారు. ఆటా ఉపాధ్యక్షులు జయంత్ చల్లా సంస్థ సేవా కార్యక్రమాలను డిసెంబర్ లో జరిగే ఆటా వేడుకలు వివరించి మరియు జూన్ లో జరిగే ఆటా 18 వ కన్వెన్షన్ & యూత్ కాన్ ఫరెన్స్ జార్జియా వర్ల్డ్ కాంగ్రెస్ సెంటర్, అట్లాంటా ఆహ్వానించారు.
యాదాద్రి జిల్లాలోని మోత్కూరు మండలంలోని కొండగడప గ్రామంలో జన్మించిన డాక్టర్ శ్రీకర్ కె రెడ్డి 1996లో కాకతీయ వర్సిటీ వైద్య కళాశాల నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అనంతరం ఐఎఫ్ఎస్కు ఎంపికై తన బ్యాచ్‌లోనే సమర్థుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. జర్మనీలోని బెర్లిన్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయంలో పనిచేసిన ఆయన.. దిల్లీలోని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలోనూ సేవలందించారు. గతంలో కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేసిన డాక్టర్ టి.వి.నాగేంద్ర ప్రసాద్ తర్వాత మరో తెలుగు వ్యక్తి ఆ పదవి చేపట్టడం తెలుగువారికి గర్వకారణం.













