ప్రతిష్టాత్మకంగా జరిగిన ఆటా “ఝుమ్మంది నాదం” ఫైనల్స్ పాటల పోటీలు
అమెరికా తెలుగు సంఘం (ఆటా) “ఝుమ్మంది నాదం” శాస్త్రీయ , సినీ సంగీత పాటల పోటీలను ,
2020 సంవత్సరం ఆగస్టు 8,9 వ తేదీలలో ఆన్ లైన్ లో జూమ్ ద్వారా నిర్వహించింది. 71 మంది గాయని గాయకులు అమెరికా లోని పలురాష్ట్రాలనుండి ఆసక్తితో పాల్గొన్నారు. శ్రీ. రామ క్రిష్ణా రెడ్డి ఆల బోర్డు అఫ్ ట్రస్టీ , శ్రీమతి. శారదా సింగిరెడ్డి ఝుమ్మంది నాదం చైర్ కార్యక్రమ నిర్వాహకులుగా వ్యవహరించారు.
అమెరికా మరియు ఇండియా నుండి సంగీత దర్శకులు శ్రీ.. రాజ శేఖర్ సూరిభొట్ల, ప్లే బ్యాక్ సింగర్ మరియు సంగీత దర్శకులు శ్రీ. నిహాల్ కొండూరి , సంగీత దర్శకులు శ్రీ. శ్రీని ప్రభల, కర్నాటిక్ మ్యూజిక్ వోకలిస్ట్ శ్రీమతి. డా. టికె. సరోజ,, సంగీత దర్శకులు మరియు ప్లే బ్యాక్ సింగర్ శ్రీ. సునీల్ కశ్యప్, సినీనటి శ్రీమతి లయ న్యాయ నిర్ణేతలు గా వ్యవహిరించారు.
టెక్సాస్ , కాలిఫోర్నియా, వర్జీనియా , వాషింగ్టన్ , న్యూ జెర్సీ , జార్జియా, నార్త్ కెరోలీనా రాష్ట్రాలనుండి ఆటా ఝుమ్మంది నాదం శాస్త్రీయ సంగీతంలో సబ్ జూనియర్స్ క్యాటగిరిలో వైష్ణవి రెండుచింతల విన్నర్ గా , పర్ణిక ఉల్లంగి రన్నర్ గా నిలిచారు. జూనియర్స్ క్యాటగిరిలో శశాంక ఎస్ యెన్ విన్నర్ గా, హైందవి వెళదండ రన్నర్ గా నిలిచారు. సీనియర్స్ క్యాటగిరిలో అపరాజిత పమిడి ముక్కాల విన్నర్ గా , సిరి వడ్డిపర్తి రన్నర్ గా నిలిచారు. సినీ సంగీతంలో సబ్ జూనియర్స్ క్యాటగిరిలో మహి ఓత్ర విన్నర్ గా, వైష్ణవి రెండుచింతల రన్నర్ గా నిలిచారు. జూనియర్స్ క్యాటగిరిలో అదితి నటరాజన్ విన్నర్ గా, ఆదిత్య కార్తీక్ ఉపాధ్యాయుల రన్నర్ గా నిలిచారు. సీనియర్స్ క్యాటగిరి లో మైన ఈదుల విన్నర్ గా, అపరాజిత పమిడి ముక్కాల రన్నర్ గా నిలిచారు
ఆటా ప్రెసిడెంట్ శ్రీ. పరమేష్ భీం రెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీ. భువనేశ్ రెడ్డి భుజాల , అడ్వైసరి టీమ్, బోర్డు అఫ్ ట్రస్టీస్, స్టాండింగ్ కమిటీ చైర్స్, రీజనల్ డైరెక్టర్స్ ,రీజినల్ కోఆర్డినేటర్స్, ఝుమ్మంది నాదం టీం మరియు సోషల్ మీడియా టీం విజేతలకు అభినందనలు తెలియ చేసారు. పోటీలో పాల్గొన్న గాయని గాయకులు, వారి తల్లి తండ్రులు ఆటా సంస్థ కార్యవర్గ బృందానికి, న్యాయ నిర్ణేతల కు కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా ఆన్లైన్ లో చూస్తున్న ప్రేక్షకుల మన్ననలను, ప్రశంసలను పొందడం సంస్థకు గర్వకారణం..
ఆటా సంస్థ లైవ్ ప్రచారం చేస్తున్న మన టీవి, మన టీవి ఇంటర్నేషనల్, టీవి 5 , జి .యెన్. యెన్ , ఏ. బి. ర్ ప్రొడక్షన్స్ , అలాగే తెలుగు యెన్.ఆర్.ఐ రేడియో, టోరీ రేడియో మీడియా మిత్రులందరికి కృతజ్ఞతలు తెలియచేసారు. ఝుమ్మంది నాదం పాటల పోటీల విజయవంతానికి కృషి చేసిన ఆటా కార్యవర్గ బృందానికి ఆటా ప్రెసిడెంట్ శ్రీ. పరమేష్ భీంరెడ్డి ప్రశంసలను తెలిపారు.













