ర్యాలీలో ‘‘ఆటా’’ సయ్యంది పాదం నృత్య పోటీలు
జూలై 1 నుండి 3వ తేదీ వరకు వాషింగ్టన్ డీసీలో జరగనున్న 17వ ఆటా కన్వెన్షన్ మరియు యూత్ కాన్ఫరెన్స్‌లో భాగంగా, ఆటా కన్వెన్షన్ టీమ్ మే 15 ఆదివారం నాడు ర్యాలీ, నార్త్ కరోలినాలో సయ్యంది పాదం నృత్య పోటీని నిర్వహించింది. ఈ పోటీలకు 45కి పైగా డ్యాన్స్ గ్రూపులు రిజిస్టర్ చేసుకున్నాయి. కూచిపూడి, భరత నాట్యం, కథక్, ఒడిస్సీ, ఫోక్, ఫ్యూజన్ మొదలైన వివిధ నృత్య రూపాల్లో పోటీదారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ నృత్య పోటీలకు న్యాయనిర్ణేతలుగా శ్రీమతి కవిత కొండ, శ్రీమతి నీనా రాయ్ మరియు శ్రీమతి వైజయంతి జంధ్యాల వ్యవహరించారు. ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీమతి మధు బొమ్మినేని మరియు ఆటా ట్రస్టీ అనిల్ బోదిరెడ్డి జూనియర్ మరియు సీనియర్ విభాగంలో గ్రూప్, సోలో, నాన్-క్లాసికల్, క్లాసికల్ విజేతలకు సర్టిఫికేట్లు మరియు మొమెంటోలను అందచేశారు. అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు శ్రుతి చామల గడ్డం, స్మితా రవి, విజిత వెన్నెవల్లి, దీపా నవీన్, లీనా గుంటకండ్ల, వర్ష చల్లపల్లి, కీర్తి అల్లంగి, సిరి దొమ్మట మరియు ర్యాలీ సయ్యంది పాదం టీమ్‌ని ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆటా కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు మరియు కో-కన్వీనర్ సాయి సుధిని విజేతలను అభినందించారు, ర్యాలీ, నార్త్ కరొలినవాసులను కన్వెన్షన్‌కు హాజరుకావాలని ఆహ్వానించారు మరియు కాన్ఫరెన్స్‌కు వచ్చి ప్రదర్శన ఇవ్వవలసిందిగా పలువురు కళాకారులను ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి, వారి తల్లిదండ్రులకు శ్రుతి చామల గడ్డం కృతజ్ఞతలు తెలిపారు. వాషింగ్టన్ డీసీలో ఫైనల్స్‌లో ప్రదర్శన ఇవ్వడానికి కాన్ఫరెన్స్‌కు హాజరు కావాలని అందరినీ ప్రోత్సహించారు. సయ్యంది పాదం పోటీల చైర్ సుధా కొండపు నిరంతరం సహకారం అందిస్తున్న సలహాదారు రామకృష్ణారెడ్డి ఆల గారిని అభినందించారు. ఆటా టీమ్ సభ్యులు మరియు వాలంటీర్లు కళ్యాణ్ గడ్డం, అజయ్ అనుగు, శివ గీరెడ్డి, హరీష్ కుందూరు, రేవంత్ పచ్చిక, వీరేందర్ బొక్క, ఇమ్రాన్, రవి ముత్తుస్వామి, ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేశారు. ఆటా కన్వెన్షన్ సందర్భంగా వివిధ కార్యక్రమాలు, క్రీడలు మరియు ఈవెంట్లను నిర్వహిస్తోంది. వీటిలో అందాల పోటీలు, సయ్యంది పాదం మరియు ఝుమ్మంది నాదం ఎంతో ప్రత్యేకమైనవి.













