విజయ నిర్మల మృతికి అమెరికా తెలుగు సంఘం సంతాపం
ప్రముఖ నటి, దర్శకురాలు.. సూపర్‌స్టార్ కృష్ణ భార్య విజయ నిర్మల (73) కన్నుమూసారు. గత కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆమె మృతికి అమెరిక తెలుగు సంఘం తరపున అధ్యక్షులు పర్మేశ్ భీంరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలను డైరెక్ట్ చేసిన మహిళ గిన్సిస్ బుక్‌తో పాటు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు.
అంతేకాదు నటిగా, దర్శకురాలిగా తెలుగు సిని కళామతల్లికి విశిష్ట సేవలందించారని ఈ సందర్భంగా కొనియాడారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించగలరని, అద్భుతమైన ప్రతిభ చూపగలరని ఆమె ఆరోజుల్లోనే నిరూపించారు. గత సంవత్సరం అమెరికా తెలుగు సంఘం తరపున హైదరాబాద్‌లో నిర్శహించిన ఆట వేడుకల్లో భాగంగా సూపర్‌స్టార్ కృష్ణ విజయ నిర్మలకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ బహుకరించాం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాడ సానూభూతి తెలుపుతున్నట్లు పర్మేశ్ భీంరెడ్డి తెలిపారు.













