ఆకట్టుకునే కార్యకమ్రాలతో కాన్ఫరెన్స్‌ను నిర్వహిస్తున్నాము : తెలుగుటైమ్స్‌తో ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని
అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారి 18వ ఆటా కన్వెన్షన్ మరియు యూత్ కాన్ఫరెన్స్ జూన్ 7 నుండి 9 వరకు అట్లాంటాలో అంగ రంగ వైభవంగా జరగబోతున్నది. సాంస్కృతిక, నృత్య, సాహిత్య, సంగీత కలాపాలు, కొత్త పరిచయాలు, ప్రముఖ వ్యక్తులు సందడి, మంచి ఆహారం, జ్ఞానాన్ని పెంపొందించే సదస్సుల వంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలతో ఆటా కాన్ఫరెన్స్ జరగనున్నది. ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని తెలుగు టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడిరచారు.
ఆటా కాన్ఫరెన్స్‌లో ముఖ్య కార్యక్రమాలేమిటి?
ఆటా కాన్ఫరెన్స్‌లో ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. చిన్నారులకు, పెద్దలకు, మహిళలకు, యువతకు నచ్చేలా కార్యక్రమాలను రూపొందించాము. సినీమా పాటలు, సంగీత విభావరులు, నాటికలు, స్థానిక కళాకారుల నృత్య ప్రదర్శనలు, సాహిత్య కార్యక్రమాలు, బిజినెస్ సెమినార్లు, సిఎంఇ వంటి ఎన్నో కార్యక్రమాలు అందరినీ అలరించేలా ఏర్పాటు చేశాము. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ సంగీత కచేరీ అందరినీ ఉత్సాహ పరుస్తుందని అనుకుంటున్నాను. అలాగే భద్రాచల శ్రీ సీతారాముల కళ్యాణం వంటివి ఆధ్యాత్మిక సంప్రదాయాలను తెలియజేస్తుంది. పలువురు సాహితీ వేత్తలతో వివిధ అంశాలపై సాహితీ ప్రసంగాలను ఏర్పాటు చేశాము. వైద్యరంగంలో వచ్చిన మార్ప్ూలపై ప్రముఖ డాక్టర్లతో సిఎంఇ కార్యక్రమాలు ఉన్నాయి. ఇలా ఎన్నో కార్యక్రమాలు కాన్ఫరెన్స్‌లో ఆకట్టుకునేలా కనిపిస్తాయి.
ఆటా కాన్ఫరెన్స్ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి?
ఆటా ఆధ్వర్యంలో అట్లాంటాలో జూన్ 7 నుంచి 9 వరకు నిర్వహిస్తున్న ఆటా కాన్ఫరెన్స్‌ను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు వీలుగా అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశాము. ఈ మహాసభలకోసం 6 నెలల ముందునుంచే ప్రణాళికలు ఏర్పాటు చేసుకుని, అందుకు తగ్గట్టుగా కమిటీలను నియమించుకుని పని చేశాము. వందలాదిమంది అహోరాత్రులు ఈ మహాసభల విజయవంతం కోసం శ్రమిస్తున్నారు. ఒక్కో కమిటీ తమకు అప్పగించిన పనిని, తమ ఆధ్వర్యంలో జరిగే పనుల విజయవంతంకోసం కృషి చేస్తున్నాయి. వచ్చిన అతిధులు సంతోషించేలా సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నాము. అలాగే బిజినెస్ ప్రముఖులతో ప్రసంగాలను, తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే రాజకీయ నేతలు, ప్రభుత్వాధినేతలతో ప్రసంగాలను ఏర్పాటు చేశాము. అలాగే ఇతర కార్యక్రమాలు కూడా ఈ కాన్ఫరెన్స్‌లో ఉంటాయి.
ఈ కాన్ఫరెన్స్‌కు ఎవరెవర్ని ఆహ్వానించారు…
కాన్ఫరెన్స్‌కోసం పలువురు ప్రముఖులను ఆహ్వానించాము. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, దామోదరరాజ నర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, గడ్డం ప్రసాద్ కుమార్ (స్పీకర్), ఎమ్మెల్యేలు హరీష్ రావు, నలమాడ పద్మావతి, పైడి రాకేశ్ రెడ్డి, వెంకట్రమణారెడ్డి, మధు సూధన్ రెడ్డి తదితరులను ఆహ్వానించాము.
సాహిత్యరంగానికి సంబంధించి నందినిసిదారెడ్డి, యండమూరి వీరేంద్రనాథ్, తనికెళ్ల భరణి, అవసరాల శ్రీనివాస్, తల్లావరaు్జల పతంజలి శాస్త్రి, సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి, కాసర్ల శ్యామ్, అఫ్సర్, అంబికా అనంత్, గొర్తి బ్రహ్మానందం, చంద్ర కన్నెగంటి, కల్పన రెంటాల, నారాయణస్వామి శంకరగిరి, శివ సోమయాజుల, మధు పెమ్మరాజు, వడ్డేపల్లి కృష్ణ, అనిల్ రాయల్ తదితరులను ఆహ్వానించాము.
సినిమా రంగం నుంచి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, విజయ్ దేవరకొండ, శ్రీకాంత్, కార్తికేయ, ఆనంద్ దేవరకొండ, బోనీ కపూర్, జాన్వీకపూర్, అంకితా జాదవ్, మెహ్రీన్ పిర్జాదా, ఖుషీ కపూర్, గౌరీ ప్రియ, తమ్మారెడ్డి భరద్వాజ, సందీప్ రెడ్డి వంగా, రోహిణి, వి.జె. సన్ని తదితరులను ఆహ్వానించాము. అలాగే జబర్దస్త్ నరేష్, సరయు, మిమిక్రీ రమేష్ తదితరులను కూడా ఆహ్వానించాము. సంగీతరంగానికి సంబంధించి ప్రముఖ సంగీత దర్శకుడు తమన్, మీనాక్షి అనిపిండి తదితరులను ఆహ్వానించాము. బిజినెస్ రంగం నుంచి కూడా పలువురు ప్రముఖులు ఈ మహాసభలకు తరలివస్తున్నారు.
ఆధ్యాత్మికగురు కమలేష్ డి. పటేల్ (దాదాజీ) కూడా ఈ కాన్ఫరెన్స్‌కు ముఖ్య అతిధిగా హాజరవుతున్నారు.
తెలుగుటైమ్స్ ద్వారా మీరిచ్చే సందేశమేమిటి?
ఆటా ప్రతిరెండేళ్ళకోమారు ఆటా నిర్వహించే మహాసభలు ప్రపంచంలోని తెలుగువారందరినీ ఒకే వేదికమీదకు కలుసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. అలాగే ఈ కాన్ఫరెన్స్‌కు కూడా మీరంతా కుటుంబ సమేతంగా వచ్చి తెలుగు రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి తెలుగు ప్రముఖులను, ప్రభుత్వాధినేతలను, సినీ కళాకారులను, నేపథ్యసంగీత గాయనీ గాయకులను కలుసుకుని ఆనందించాల్సిందిగా కోరుతున్నాను. మీరందరినీ తెలుగుటైమ్స్ మూలంగా కాన్ఫరెన్స్‌కు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను.







