అమెరికా తెలుగు సంఘం “ఆటా నాదం” పాటల పోటీలు
అమెరికా తెలుగు సంఘం (ఆటా) “ఆటా నాదం” పాటలపోటీలను ఆన్లైన్ లో జూమ్ ద్వారా నిర్వహిస్తుంది. దాదాపుగా 200 మంది గాయని గాయకులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి పాల్గొన్నారు. ఉత్తరాధ్యక్షులు మరియు ఆటా సేవ డేస్ & ఆటా వేడుకల చైర్ మధు బొమ్మినేని, పాలకమండలి సభ్యులు, సంయుక్త కార్యదర్శి, ఆటానాదం కోఆర్డినేటర్ రామకృష్ణా రెడ్డి ఆల, పాలక మండలి సభ్యులు సేవ డేస్ & ఆటా వేడుకల కో చైర్ అనిల్ బొద్దిరెడ్డి, పాలక మండలి సభ్యులు సేవ డేస్ & ఆటా వేడుకల కో చైర్ శరత్ వేముల, పాలకమండలి సభ్యులు ఆటా నాదం కోఆర్డినేటర్ శారద సింగిరెడ్డి మాతృదేశంలో ఇరు తెలుగురాష్ట్రాలలో ప్రతిభ ఉన్న గాయని గాయకుల కోసం మొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఆటా సంస్థ “ఆటా నాదం” పాటల పోటీలను అక్టోబర్ 23న ప్రిలిమినరీ రౌండ్ తో ప్రారంభించి సెమి ఫైనల్స్ నవంబర్ 6 న ముగించింది. ఈ కార్యక్రమాలకు సంగీత దర్శకులు, ప్లేబాక్ సింగర్ నిహాల్ కొందూరి, ప్లేబాక్ సింగర్, సినీ మ్యుజిషియన్ యూనియన్ ప్రెసిడెంట్ విజయ లక్ష్మి, సంగీత దర్శకులు,ప్లేబ్యాక్ సింగర్ సాయి శ్రీకాంత్ వెళ్లల, ప్లేబాక్ సింగర్ నూతన మోహన్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఇరు తెలుగు రాష్ట్రాల నుండి పదకొండు మంది గాయని గాయకులు అభినవ్ అవసరాల, గీత మహతి పిసుపాటి, జ్యోస్న నిమ్మలపాడి, లక్ష్మి శ్రీవల్లి కాందూరి, లేఖ సదా ఫణిశ్రీ వీర, మేఘన నాయుడు దాసరి, నిగమ నెల్లుట్ల, ప్రణతి కే , సాయి శృతి పొలిశెట్టి, సాకేత్ కొమ్మజోస్యుల, వెంకట సాయి లక్ష్మి హర్షిత పాసాల ఫైనల్ రౌండ్ కు ఎంపిక అయ్యారు. గెలుపొందిన ఈ గాయని గాయకులు కోటి మ్యూజిక్ డైరెక్టర్ గారు అలాగే పైన వివరించిన నలుగురు న్యాయ నిర్ణేతల సమక్షంలో నవంబర్ 13, 2021 న జరిగే ఫైనల్స్ లో పోటీపడుతున్నారు.
ఆటా ఉత్తరాధ్యక్షులు ఆటా సేవ డేస్ & ఆటా వేడుకల చైర్ మధు బొమ్మినేని డిసెంబర్ 5,2021 నుండి డిసెంబర్ 25 2021 వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో, అధ్యక్షులు భువనేశ్ బూజల, పాలక మండలి సభ్యులు మరియు ఆటా కార్యవర్గ బృందంతో కలిసి విద్య, వైద్య, కమ్యూనిటీ సేవలు, స్త్రీ సంక్షేమ, బిజినెస్ సెమినార్స్, ఎడ్యుకేషనల్ సెమినార్స్ లాంటి వివిధ కార్యక్రమాలు వివిధ నగరాలలో, గ్రామాలలో నిర్వహించ బోతున్నారు.
ఈ కార్యక్రమాలతో పాటు సాహిత్య, సంగీత, నృత్య కార్యక్రమాలు మాతృదేశం కళాకారులతో వివిధ నగరాలలో నిర్వహిచబోతున్నారు. ప్రతీ రెండు సంవత్సరాల కోసం ఆటా మహాసభలు జరుగ బోయే ముందు, ప్రథమంగా తెలుగు రాష్ట్రాలలో సేవ కార్యక్రమాలు చేయడములో సంస్థ క్రమం తప్పకుండ బాధ్యతతో ముందంజలో ఉంటుంది. ఆటా వేడుకల కార్యక్రమములో భాగంగా ప్రతిభా వంతులైన యువ గాయనీ గాయకులకు ఆటా లో ప్రత్యేకమైన వేదికను కలిపించాలని సదుద్దేశము తో “ఆటా నాదం“ పాటల పోటీల కార్యక్రమానికి అంకురార్పణ చేసింది. విజేతలకు “ఆటా వేడుకలు గ్రాండ్ ఫినాలే” రవీంద్రభారతి హైదరాబాద్ డిసెంబర్ 26, 2021 లో సాయంత్రం 7 గంటలకు జరిగే సాంస్కృతిక కార్యక్రములో పాడడానికి గొప్ప అవకాశం ఆటా సంస్థ కలిగిస్తుంది.













