ATA: హ్యూస్టన్ లో ఘనంగా ఆటా మదర్స్ డే వేడుకలు
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) అద్వర్యంలో హ్యూస్టన్ మహానగరంలోని అష్టలక్ష్మి గుడిలో మదర్స్ డే (Mother’s Day) సెలెబ్రేషన్స్ మే 4 వ తారీఖున అంగరంగ వైభవంగా జరిగింది. 250 మందికి పైగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆటా అధ్యక్షుడు జయంత్ చల్ల, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నర్సిరెడ్డి గడ్డికొప్పులా, జాయింట్ సెక్రటరీ శారద సింగిరెడ్డి పాల్గొన్నారు. ముఖ్య అతిధులుగా జడ్జి ట్రిసియా క్రేనేక్, జడ్జి ఎడ్వర్డ్ ఎం. క్రేనేక్, డాక్టర్ కల్పలత గుంటుపల్లి. డాక్టర్ రేణు తమిరిస, రత్న కుమార్, ఆశ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆటా హ్యస్టన్ నాయకులు ఎంతో ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు అందరిని ఆకట్టుకున్నాయి. బోర్డు అఫ్ ట్రస్టీ శ్రీధర్ కంచనకుంట్ల, రామ్ మట్టపల్లి కార్యక్రమం పర్యవేక్షించారు, జె.పి. ముదిరెడ్డి జగపతి వీరతి, దయాకర్ ధవళాపూర్, వెంకట్ రమణ రెడ్డి ఎరువు, వెంకట్ గార్లపాటి, బంగారు రెడ్డి ఆలూరి తదితరులు తోడ్పాటు అందించారు.








