అభివృద్ధిలో భాగస్వాములవుతాం – ఆటా
తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న రాష్ట్రాభివృద్ధిలో తాము కూడా భాగస్వాములవుతున్నామని అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ప్రతినిధులు పేర్కొన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండలం సోడషపెల్లి గ్రామంలో ఆటా ప్రతినిధి పల్లా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు రూ.2 కోట్లతో రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. గద్వాల జిల్లా గట్టు మండలంలో రూ.65 లక్షలతో పాఠశాలల్లో మౌలిక వసతులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పలు కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు కూడా తెలిపారు. 22న హైదరాబాద్‌లో నెక్లెస్ రోడ్డులో 5కే రన్ నిర్వహిస్తున్నామన్నారు. సమావేశంలో తాతా మధుకర్, తెలంగాణ డెవలఫ్‌మెంట్ ఫౌండేషన్ అధ్యక్షుడు లక్ష్మణ్ ఏనుగుల, ఆటా అధ్యక్షుడు పరమేశ్ భీంరెడ్డి, కార్యదర్శి సౌమ్య కొండపల్లి, కమిటీ సభ్యులు రఘువీర్ బండారు, జయంత్ చల్లా, చంద్రప్రకాశ్‌రెడ్డి, గుజ్జుల, రమేశ్‌రెడ్డి పాల్గొన్నారు.













