ATA: కళారంగ దిగ్గజాలు పద్మశ్రీ ఉమామహేశ్వరి, డాక్టర్ కళా కృష్ణలకు ఆటా సన్మానం

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) రాలీ చాప్టర్, ఆగష్టు 17వ తేదీ ఆదివారం నాడు, భారతీయ శాస్త్రీయ కళారంగంలో ఇద్దరు దిగ్గజాలైన హరికథా కళాకారిణి పద్మశ్రీ డి. ఉమా మహేశ్వరి, ఆంధ్ర నాట్యం గురువు డాక్టర్ కళా కృష్ణలను ఘనంగా సన్మానించింది. ఈ మీట్ & గ్రీట్ కార్యక్రమానికి 65 మందికి పైగా కళాకారులు, విద్యార్థులు, కమ్యూనిటీ లీడర్లు హాజరయ్యారు. తరాల మధ్య వారధిగా నిలిచి, సాంప్రదాయ తెలుగు కళల పట్ల యువతలో అవగాహన పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆటా (ATA) తెలిపింది. యువ కళాకారులు సహస్ర కురాపాటి, స్నిగ్ధ చందూరి ఈ ప్రముఖులను సభకు పరిచయం చేశారు. సంస్కృతంలో హరికథను ప్రదర్శించిన తొలి మహిళగా పేరుపొందిన పద్మశ్రీ డి. ఉమా మహేశ్వరి గారి హరికథా ప్రదర్శన, ‘అభినవ సత్యభామ’గా పేరొందిన డాక్టర్ కళా కృష్ణ గారి ప్రసంగం అందరినీ మంత్రముగ్ధులను చేశాయి.
ఆటా (ATA) బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (BOT) సభ్యులు సాయి సుధిని, ఆటా మాజీ అధ్యక్షులు మధు బొమ్మినేని ఈ కళాకారులను సన్మానించారు. ఆటా (ATA) లాంగ్వేజ్ అండ్ కల్చరల్ చైర్ కవిత కొండ మాట్లాడుతూ.. కళా సంప్రదాయాలను పరిరక్షించడానికి కళాకారుల సేవలను గుర్తించడం ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ఆటా రేలీ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బీఓటీ సభ్యులు సాయి సుధిని, రీజనల్ సలహాదారులు శివ గీరెడ్డి, పవన్ నోముల, రీజనల్ కోఆర్డినేటర్ శివ కుమార్ త్రిపురారి, రీజనల్ డైరెక్టర్ దీపిక మాలే, స్టాండింగ్ కమిటీ సభ్యులు రాజు కురాపాటి, అజయ్ మద్ది, రేవంత్ రెడ్డి, కవిత కొండలను ఆటా ప్రత్యేకంగా అభినందించింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని మధు బొమ్మినేని, సాయి సుధిని, కవిత కొండ హామీ ఇచ్చారు.