అట్లాంటా లో ఆటా కాన్ఫరెన్స్ ఫండ్ రైజింగ్ ఈవెంట్
ATA 18వ కాన్ఫరెన్స్, యూత్ కన్వెన్షన్ కిక్ ఆఫ్ మరియు ఫండ్ రైజింగ్ ఈవెంట్ తో డిసెంబర్ 2, 2024 Zade events, అట్లాంటా లో ప్రత్యేక సందడి నెలకొల్పింది. సుమారు 1000 కి పైగా విచ్చేసిన జన సమూహంతో కిటకిటలాడగా గణనాథుని ఆరాధనతో జ్యోతిప్రజ్వలనతో శ్రీకారం చుట్టుకున్న ఆ అద్భుత సాయంత్రం నృత్య, సంగీత మరియు వినోదాత్మక కార్యక్రమాలతో ఆద్యంతం ఉల్లాసభరితంగా సాగింది.
ATA కన్వెన్షన్ పాట, ATA కన్వెన్షన్ డోనర్సు, స్పాన్సర్లు మరియు కన్వెన్షన్ కోర్ టీం సభ్యుల పరిచయం మరియు సత్కారం, ATA అట్లాంటా కోర్ టీం పరిచయం, ATA కన్వెన్షన్ కమిటీలు మరియు ఆయా కమిటీ చైరు, కో- చైరు, అడ్వైజరు మరియు మెంబర్ల పరిచయం మరియు సత్కారాలతో సందడి నెలకొనగా అట్లాంటా తరుపున కన్వెన్షన్ కొరకు 1.45 మిలియన్ డాలర్ల నిధుల సేకరణ విశేష వార్తగా మరియు అట్లాంటా గర్వించదగు క్షణంగా నిలిచింది అనడంలో అతిశయోక్తి లేదు.
ఈ సందర్భంగా ATA ప్రెసిడెంట్ శ్రీమతి మధుబొమ్మినేని ప్రసంగిస్తూ ATA 18వ కన్వెన్షన్ కొరకు అట్లాంటా చేపడుతున్న అద్భుత సన్నాహాలకు, అనూహ్య నిధి సేకరణకు తమ హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా విశిష్ఠ అతిథి, విశ్వ ప్రసిద్ధులు , విశేష కళాకారులు శ్రీ మిమిక్రీ రమేష్ తమ మిమిక్రీ కళాప్రదర్షనతో ప్రత్యేక సందడ్లు నెలకొల్పారు. వివిధ ప్రణాళికలు మరియు ప్రతిపాదనలతో , సందేశాలతో కన్వెన్షన్ కన్వీనర్ కిరణ్ పాశం, కన్వెన్షన్ కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి , కన్వెన్షన్ డైరెక్టర్ అనిల్ బొడ్డిరెడ్డి, కో- కోఆర్డినేటర్ ప్రశీల్ గూకంటి, కో- డైరెక్టర్ శ్రీరామ్, కన్వెన్షన్ అడ్వైసర్ కమిటీ చైర్ గౌతమ్ గోలి మరియు కన్వెన్షన్ అడ్వైసర్లు కరుణాకర్ అసిరెడ్డి వెంకట్ వీరనేని ప్రసంగాలు మరియు కన్వెన్షన్ టీం కన్వెన్షన్ గూర్చి అందించిన ఇతర ముఖ్య సమాచారం మరియు సందేశాలు సభాసదులకు కీలక అంశాలను తెలియచేశాయి.
పలు జాతీయ మరియు ప్రాంతీయ తెలుగు సంఘాలు TANA, NATA, TTA, TDF, GTA , TAMA, GATeS, GATA , IFA, శంకర్ నేత్రాలయ వారి అనూహ్య ఆదరణ మరియు సహకారాలతో సామరస్య ఉమ్మడి కుటుంబ సందడిని ప్రతిబింబించింది ATA కిక్ ఆఫ్ కార్యక్రమం అంటూ ప్రత్యేక ప్రశంసనందుకుంది.
ఈవెంట్ కోఆర్డినేటర్లు అనుపమ సుబ్బగరి, శృతి చిట్టూరి, ఉదయ ఈటూరి, మల్లిక దుంపల మరియు శ్వేత, ఈవెంట్ ఆంకర్లు శ్రావణి రాచకుళ్ళ, మాధవి దాస్యం, రీజనల్ డైరెక్టర్ గోపి కొడాలి, రీజనల్ కోఆర్డినేటర్లు సందీప్, గణేష్ కాసం & కిషన్ , స్టాండింగ్ కమిటీ చైర్లు మరియు సభ్యులు జయ చంద్ర, ఉమేష్ ముత్యాల, శివ రామడుగు, రఘు వలుసాని, నిరంజన్ పొద్దుటూరి, శ్రీధర్ పాశం, కీర్తిధర్, కాన్ఫరెన్స్ కో- కన్వీనర్ ప్రశాంతి అసిరెడ్డి మరియు కాన్ఫరెన్స్ నేషనల్ కోఆర్డినేటర్ సాయి సుదిని ఆద్యంతం అద్భుత సహకారాన్ని అందిస్తూ కార్యక్రమ నిర్వహణలో పాల్గొనడం ముదావహం.
కన్నులనబ్బురపరిచే ఆహ్లాధభరిత సాంస్కృతిక కార్యక్రమాలతో సభ సరదాలతో నిండిపోగా రీజనల్ డైరెక్టర్స్ కృతజ్ఞతా ప్రతిపాదనలతో కార్యక్రమం విజయవంతం మరియు జనరంజకంగా ముగిసింది.













