తెలుగు రాష్ట్రాల్లో ఆటా ఫౌండేషన్ సేవలు
మై స్కూల్ మై రెస్పాన్సిబిలిటి కింద స్కూళ్ళకు సహాయం
అమెరికా తెలుగు సంఘం (ఆటా) కమ్యూనిటీ కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అలాగే ఆటా ఫౌండేషన్ ద్వారా వివిధ కార్యక్రమాలను కూడా చేపట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా మై స్కూల్ మై రెస్పాన్సిబిలిటీ (MSMR) ప్రాజెక్ట్ కింద రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్య మరియు ఆరోగ్య సంబంధిత ప్రాజెక్ట్‌లను చేపట్టింది. ఈ కార్యక్రమం కోసం పలువురు ఆటా సభ్యుల నుంచి విరాళాలను వసూలు చేయడం.. వారిని కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాము లను చేస్తోంది. మన పిల్లలు చదువుకు నేందుకు తగిన వసతులను కల్పించడంతో పాటు వారిని భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దాలంటే అందరూ కృషి చేస్తేనే అవుతుంది. అందుకు మీ సహాయ సహకారాలు అవసరమని ఆటా భావిస్తోంది. ఆటా చేపట్టిన ఈ కమ్యూనిటీ ప్రాజెక్టులో మీరంతా పూర్తిగా పాలుపంచుకోవాలని ఆటా ఫౌండేషన్ కోరుతోంది.
2021 సంవత్సరంలో చేపట్టిన కార్యక్రమాలు:
* పూర్తి చేసిన పాఠశాలల సంఖ్య: 22
* పురోగతిలో ఉన్న పాఠశాలల సంఖ్య: 5
* ప్రారంభ దశలో ఉన్న పాఠశాలల సంఖ్య: 3
చేపట్టిన సహాయం:
* భవన పునరుద్ధరణ మరియు కాంపౌండ్ వాల్ నిర్మాణం
* పెయింటింగ్ మరియు గోడ చిత్రాలు
* సురక్షితమైన తాగునీరు మరియు వాషింగ్ సౌకర్యాలు
* డ్యూయల్ డెస్క్ బెంచీలు
* సైన్స్ ల్యాబ్ / లైబ్రరీ / స్పోర్ట్స్ కిట్లు, డ్రమ్స్
* కంప్యూటర్లు మరియు ప్రింటర్లు
* సౌర విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ
* పాఠశాల అటెండర్ యొక్క ఉపాధి
* దీంతోపాటు పాఠశాల విద్యార్థుల ప్రతిభను మెరుగుపరుచుకునేలా స్పెల్లింగ్ బీ, క్విజ్ పోటీలు వంటివి నిర్వహించడం, గ్రీన్ క్లబ్, న్యూట్రిషన్ క్లబ్, రీడిరగ్ క్లబ్, స్వచ్ఛ పాఠశాల క్లబ్, సైన్స్ క్లబ్ వంటివి ఏర్పాటు చేయించడం వంటి విషయాల్లో ఆటా ఫౌండేషన్ సహాయపడుతోంది.
* జనవరి 2022 నాటికి ఈ కార్యక్రమ నిర్వహణకు వినియోగించబడిన నిధులు: 70,000 డాలర్లు
* 2022 సంవత్సరంలో 100 పాఠశాలలకు కావాల్సిన సహాయపనులను పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకుని ఆటా ఫౌండేషన్ పనిచేస్తోంది. పని చేస్తున్నారు. ఆటా సభ్యులు ఎవరైనా తమకు నచ్చిన పాఠశాలకు మీ విరాళంలో 1000 శాతం వరకు సరిపోతుంది.
ఇతర వివరాల కోసం 703-626-0315కు కాల్ చేయండి.













