తైక్వాండో బ్లాక్ బెల్ట్ ఆధ్వర్యంలో ‘ఆటా ఫిట్‌నెస్’ క్లాసులు

అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో ఫిట్‌నెస్ క్లాసులు అందజేస్తున్నారు. ప్రొఫెషనల్ ట్రైనర్ ఆధ్వర్యంలో ఈ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఆదివారం నుంచి ఈ క్లాసులు మొదలవనున్నాయి. వీటిలో కిక్ బాక్సింగ్, హెచ్‌ఐఐటీ, సెల్ఫ్ డిఫెన్స్, సర్క్యూట్ ట్రైనింగ్, స్టెంగ్త్ అండ్ కండిషనింగ్, కార్డియో తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రముఖ ట్రైనర్, 4వ డాన్ బ్లాక్ బెల్ట్, తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ జాయింట్ సెక్రటరీ ముఖేష్ కుమార్ ఈ క్లాసులు అందించనున్నారు. ప్రతి ఆదివారం ఈ క్లాసులు ఉంటాయని ఆటా తెలిపింది.