H-1B Visa: హెచ్1బి వీసాపై ఆందోళనలు వద్దు.. ఇప్పటికీ అమెరికాలో స్థిరపడే అవకాశాలున్నాయి..

హెచ్ 1 బి వీసా (H-1B Visa) ఫీజు పెంపుతో స్టూడెంట్స్ నుంచి ఐటీ ఎంప్లాయీస్ వరకూ అందరిలోనూ ఒకటే ఆందోళన. అమెరికాలో ప్రస్తుతం పరిస్థితి బాగోలేదంటూ వస్తున్న వార్తలు అందరినీ భయపెడుతున్నాయి. అయితే ఇది తాత్కాలికమే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. అమెరికాకు కావాల్సిన మేధోసంపత్తి కోసం తప్పనిసరిగా హెచ్ 1బీ వీసాల సౌకర్యాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని ఆటా మాజీ అధ్యక్షుడు పరమేష్ భీంరెడ్డి స్పష్టం చేస్తున్నారు. వీసా ఫీజు పెంపు భారమైనప్పటికీ.. ఇప్పటికీ అమెరికాలో అవకాశాలకు కొరత లేదంటున్నారు.
70, 80, 90 దశకాల్లో చాలా మంది స్టూడెంట్స్ వీసాపై అమెరికాలో అడుగుపెట్టి, తర్వాత హెచ్1బీ .. అక్కడ నుంచి గ్రీన్ కార్డుకు మారారు. ఇప్పటికీ గ్రీన్ కార్డు సాధనలో ఆ రూట్ కు అవకాశాలు తెరిచే ఉన్నాయన్నారు ఆటా మాజీ అధ్యక్షుడు పరమేష్ .. అయితే హెచ్ 1బీ ఎందుకు తీసుకువచ్చారన్నది పక్కన పెట్టి… అమెరికాలో స్థిరపడాలన్న బలీయమైన కోరికతో చాలా మంది అమెరికాకు వివిధ మార్గాల ద్వారా చేరుకుంటున్నారు. ఫలితంగా ఈ వీసా దుర్వినియోగానికి గురవుతోందన్నారు పరమేష్. దుర్వినియోగం స్థాయి పెరుగుతూపోవడంతోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఈ తరహా ఆదేశాలు జారీ చేశారన్నారు.
నిజాయతీగా పనిచేస్తూ.. అత్యున్నతస్థాయి ఉద్యోగాలను పొందాలని భావించే స్పెషలైజ్డ్ నిపుణులకు ఇప్పటికీ అంతేస్థాయిలో మార్గాలున్నాయి. వారు అమెరికా చట్టాల ప్రకారం ప్రవర్తిస్తూ.. తమ అర్హతను నిరూపించుకుంటే.. కచ్చితంగా డాలర్ డ్రీమ్స్ నెరవేర్చుకోవచ్చని సూచిస్తున్నారు పరమేష్. అయితే సాదారణ డిగ్రీలతో అమెరికా ఫ్లైట్ ఎక్కేద్దాం అనుకున్న వారికి మాత్రం ఇది కచ్చితంగా ఇబ్బందికరమే అని స్పష్టం చేశారు.
హెచ్ 1 బి వీసా ఎందుకు..?
H-1 వీసా ప్రోగ్రామ్ అనేది స్పెషల్ నాలెడ్జ్.. బ్యాచిలర్ డిగ్రీ కలిగి … ఉన్నతస్థాయిలో పనిచేసే విదేశీ నిపుణుల కోసం US తాత్కాలిక వర్క్ వీసా. అయితే కంపెనీలు దీన్ని సాదారణస్థాయి ఉద్యోగాల భర్తీలోనూ వాడేస్తున్నాయి. దీంతో అమెరికాలో యూత్ లో నిరసనలు తీవ్ర రూపు దాల్చాయి.
నిజానికి గతంలో అంటే 19 వ శతాబ్దం ఆరంభంలో విదేశీ నిపుణుల అవసరాన్ని గుర్తించింది అమెరికా. వారికి అమెరికాకు ఆహ్వానించి, ఇక్కడ వర్క్ చేసే అవకాశాన్ని కల్పించింది. నాటి అమెరికా అధ్యక్షులు అందరూ దీన్ని స్వాగతించారు. దీనిలో భాగంగా 1952 ఇమ్మిగ్రేషన్ మరియు జాతీయత చట్టం (INA) H వీసా వర్గాన్ని సృష్టించింది. అంతే కాదు.. దీనికి ఎలాంటి పరిమితి విధించలేదు. సరికదా సరళంగా ఉండేది కూడా.
1990 – H-1B సృష్టి
1952 ఇమ్మిగ్రేషన్ చట్టం స్థానంలో 1990 ఇమ్మిగ్రేషన్ చట్టం అమల్లోకి తెచ్చారు నాటి అధ్యక్షుడు హెచ్.డబ్ల్యూ బుష్. దీంతో పాత హెచ్ 1 స్థానంలో …హెచ్ 1బి అమల్లోకి వచ్చింది. దీనికి బ్యాచిలర్ డిగ్రీ, అంతకన్నా అధిక అర్హతలుండాల్సి ఉంటుంది. అంతేకాదు.. 65 వేల వీసాల వార్షిక పరిమితిని విధించింది. కాల వ్యవధి కూాడా 3 సంవత్సరాలుగా నిర్దేశించంది. దీన్ని మరో మూడు సంవత్సరాల వరకు పొడిగించే అవకాశం ఉంది.
2004లో టెక్ బూమ్ నింగినంటింది. ఆ అవకాశాన్ని వినియోగించుకుంటూ కంపెనీలు, ఉద్యోగార్థులు కూడా..చేరికలను ప్రోత్సహించాయి. దీంతో వీసాలకు విపరీతంగా డిమాండ్ పెరిగింది కూడా. డాట్-కామ్ బూమ్ సమయంలో, డిమాండ్ విపరీతంగా పెరిగింది. దీంతో చిన్నచిన్న కోర్సులు చేసి, చాలా మంది అమెరికా ఎగిరిపోయారు.
1998 నాటి అమెరికన్ కాంపిటీటివ్‌నెస్ అండ్ వర్క్‌ఫోర్స్ ఇంప్రూవ్‌మెంట్ యాక్ట్ (ACWIA) తాత్కాలికంగా పరిమితిని పెంచింది: 1999లో 1.15 వేలు ఉండగా.. 2001 నాటికి వీసాల సంఖ్య 1.07 వేలకు చేరింది. 2 వేల సంవత్సరంలో అమెరికన్ కాంపిటీటివ్ నెస్ ఏసీ 21 పరిమితిని మళ్లీ పెంచింది. దీంతో 2001-03 నాటికి 1.95 వేలుగా తేలింది.
U.S. మాస్టర్స్ డిగ్రీలు (“మాస్టర్స్ క్యాప్”) కలిగిన కార్మికులకు 20,000 అదనపు వీసాలివ్వడం మొదలైంది.. ఈ కార్యక్రమంలో భాగంగా మాస్టర్ క్యాప్స్ ను ఉపయోగించుకుని.. ఐటీ అవుట్‌సోర్సింగ్ కంపెనీలు లబ్ధిపొందాయన్న ఆరోపణలున్నాయి. యూఎస్ కార్మికుల స్థానంలో తక్కువ ధరకు లభించే విదేశీ కార్మికులను నియమించడానికి H-1Bలను ఉపయోగిస్తున్నారనే విమర్శలు పెరిగాయి.
2017–2020 – ట్రంప్ 1.0 పాలన సమయం..
ట్రంప్ తొలిసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ..అమెరికా గ్రేట్ మేక్ ఎగైన్ అంటూ దేశంలోని యువతకు పెద్దపీట వేశారు. 2017 కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేశారు.అంతేకాదు.. హెచ్ 1 బీ వీసాల తిరస్కరణ శాతం పెరుగుతూ పోయింది. 2025 ఆర్థిక సంవత్సరంలో, కేవలం 85,000 స్లాట్‌లకు (65,000 రెగ్యులర్ + 20,000 మాస్టర్స్ క్యాప్) 750,000 కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లు సమర్పించబడ్డాయి.
-పరమేష్ భీంరెడ్డి – పూర్వ అధ్యక్షులు – ATA