కరోనా వేళలో…సహాయానికి ముందుకొచ్చిన ఆటా

కరోనా సెకండ్ వేవ్ దేశంలో ఊహకు కూడా అందని విధంగా పెరిగిపోతుండటం, ఆస్పత్రుల్లో చేరేందుకు పడకలు లేక, ఆక్సిజన్ లేక ఎంతోమంది ప్రాణాలను కోల్పోతున్న తరుణంలో అమెరికా తెలుగు సంఘం (ఆటా) తనవంతుగా కమ్యూనిటికీ సహాయపడేందుకు ముందుకు వచ్చింది. పేషంట్లకు అవసరమైన ఆక్సిజన్ సరఫరాకు ముందుకు వచ్చింది. ఆటా ఇతర సంఘాలతో, ఇండియన్ ఎంబసీ వర్గాలతో కలిసి ఇండియాకు అవసరమైన ఆక్సిజన్ పరికరాల పంపిణీకి ముందుకు వచ్చింది. అలాగే ఆక్సిజన్ కాన్సెన్‍ట్రేటర్‍ను దాతలు కోరినట్లుగా వారి గ్రామాల్లో, వారు కోరుకున్న చోటుకు అందజేస్తామని కూడా ఆటా ప్రకటించింది. దాతలు తమ విరాళాలను ఆటా వెబ్‍సైట్‍లో ఉన్న లింక్ ద్వారా పంపవచ్చని ఆటా అధ్యక్షుడు భువనేష్ బూజాల ఓ ప్రకటనలో తెలిపారు.