ఆటా డే వేడుకలకు మంచి స్పందన
అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఇటీవల ఆటా డే వేడుకలతోపాటు మహిళాదినోత్సవాన్ని నిర్వహించింది. కెంటకీ స్టేట్లోని లూసివిల్లెలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కెంటకీ సెనెటర్ జూలీ ఆడమ్ హాజరైయ్యారు. ఆటా కెంటకీ రిజనల్ కో-ఆర్డినేటర్ డా.మహేష్ కుమార్ గుండ్లూరు మాట్లాడుతూ.. ఈ వేడుకలకు వచ్చి వేడుకలను విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గాయని సునీతా తన పాటలతో అందరినీ అలరించారు. గుండ్లూరు కవితా, సరస్వతీ తూటుపల్లి, హేమప్రసాద్, కవితా, వెంకటేశ్వర రెడ్డి, రాజ గోపాల్ రెడ్డి, రమ్య, అనిల్, కృష్ణ భారతి, శివ రామకోటి రెడ్డి, సుజిత్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో తోడ్పాటు అందించారు. అలాగే ఈ కార్యక్రమంలో కెంటకీ నేషనల్ టీం లీడర్స్ చైర్మన్ డా. తిరుపతి రెడ్డి, కో చైర్మన్ శ్రీకాంత్ కోటగిరి, ఆటా అధ్యక్షులు కరుణాకర్ అసిరెడ్డి, ఆటా ట్రస్టీ అనిల్ బోడిరెడ్డి, వెబ్ కమిటీ చైర్మన్ ఉమేష్ ముత్యాల, రామకి ష? రెడ్డి, సుధాకర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, స్టాండింగ్ కమిటీ కో చైర్మన్ కిశోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేడుకల్లో దాదాపు 650 మంది ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.













