ఈ నెల 6న ఆటా నేతృత్వంలో కాన్సులర్ క్యాంప్
అమెరికన్ తెలుగు సంఘం (ఆటా) నేతృత్వంలో కాన్సులర్ క్యాంప్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాలిఫోర్నియాలోని నార్వాక్‌లో సనాతన్ ధర్మ ఆలయంలో ఆగస్టు 6వ తేదీ ఆదివారం నాడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ క్యాప్ జరగనుంది. దీనిలో పాస్‌పోర్ట్, పీసీస, జీఈపీ, ఓసీఐ కార్డ్, రెనన్సియేషన్లు తదితర సేవలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించనున్నారు. అలాగే పీఓఏ, లైఫ్ సర్టిఫికెట్ తదితర ధ్రువపత్రాల ధ్రువీకరణ కూడా జరుగుతుంది. ఈ క్యాంప్‌కు సంబంధించిన మరిన్ని వివరాలో కోసం కాన్సులేట్ చైర్ వెంకట్ పెద్ది, బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు విజయ్ తూపల్లి, రిండా సామా, నరసింహ ధ్యాసని, రీజనల్ కోఆర్డినేటర్లు గౌతమ్ పిండి, నిరంజన్ చల్లా, కోటి మేక, మహిళా కోఆర్డినేటర్లు శ్వేత గంగిరెడ్డి, లేఖా రెడ్డి, స్టాండింగ్ కమిటీ సభ్యులు రవీంద్ర ద్యాప, అభినవ్ చిర్రా, వెంకట్ పెద్ది, జైపాల్ రెడ్డి, శ్రీనాథ్ పేరమ్, సాగర్ గాదె తదితరులను సంప్రదించాలని ఆటా పేర్కొంది. అలాగే ఈ క్యాంప్ కోసం రిజిస్టర్ చేసుకోవాలని అనుకునే వాళ్లు https://services.vfsglobal.com/usa/en/ind/news/vfs-indian-consular-camp-in-norwalk-ca లింకులో దరఖాస్తు చేసుకోవచ్చు.













