ATA: ఆటా వేడుకలు షురూ… 16 రోజులపాటు అనేక సేవా కార్యక్రమాలు
హైదరాబాద్: అమెరికా తెలుగు అసోసియేషన్ (ATA – ఆటా) ఆధ్వర్యంలో డిసెంబర్ 12 శుక్రవారం నుండి ఈ నెల 27 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వరుసగా 16 రోజుల పాటు పలు సేవా, విద్యా, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల గురించి ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి రామసహాయం గురువారం ఒక ప్రకటనలో వివరాలు తెలిపారు.
16 రోజుల ‘ఆటా’ సేవా యాత్ర విశేషాలు..
ప్రారంభం (డిసెంబర్ 12): రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేత, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు.
సాహిత్య & వ్యాపార వేదికలు:
డిసెంబర్ 13: ఐఐటీ హైదరాబాద్లో సెమినార్, స్టార్టప్ పిచ్ పోటీలు.
డిసెంబర్ 14: ఎస్పీఆర్ యూనివర్సిటీలో సాహిత్య కార్యక్రమం.
డిసెంబర్ 16, 17: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నంలో బిజినెస్ సెమినార్లు, విద్యాపరమైన చర్చలు.
డిసెంబర్ 19: హైదరాబాద్ టీ-హబ్లో బిజినెస్ సెమినార్.
ఆధ్యాత్మికత & యువజనం:
డిసెంబర్ 15: ఆటా బృందం యాదగిరిగుట్ల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దర్శనం.
డిసెంబర్ 19, 20: హైదరాబాద్లో యువజన, క్రీడా కార్యక్రమాలు.
ఆరోగ్య సేవలు & అభివృద్ధి:
డిసెంబర్ 21: మహబూబాబాద్ జిల్లా తిమ్మాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన.
డిసెంబర్ 22: మడ్డిగట్ల గ్రామంలో చిన్నారుల కోసం విద్యా, ఆధ్యాత్మిక, వైద్య పరమైన కార్యక్రమాలు.
డిసెంబర్ 23: నాగర్కర్నూల్ జిల్లా మెడిపూర్ గ్రామంలో మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక సెమినార్, హెల్త్ క్యాంపు.
డిసెంబర్ 24: సూర్యాపేట జిల్లా అనంతారంలో వైద్య ఆరోగ్య శిబిరం, ఆలయ ప్రారంభోత్సవం.
చారిటీ కార్యక్రమాలు:
డిసెంబర్ 25: సిద్దిపేటలో ‘నిషాంత్ బాలసదన్’ చారిటీ కార్యక్రమం, సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట జిల్లాపరిషత్ పాఠశాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు.
డిసెంబర్ 27: హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఆటా గ్రాండ్ ఫినాలే.













