ATA: ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 2025-28 ఎన్నికల ఫలితాలు
అమెరికన్ తెలుగు అసోసియేషన్(ATA) -బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 2025-2028 పదవీ కాలానికి సంబంధించి ఎన్నికల ఫలితాలు రికార్డ్ సృష్టించాయి. ఆటా చరిత్రలోనే ఫస్ట్ టైం నాన్ స్లేట్ మెంబర్స్ ఆధిక్యం కనబరిచారు. లైఫ్ మెంబర్షిప్ కేటగిరీలో 9 బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ పదవులకు గాను, ఆటా ఎలక్షన్ కమిటీ రికమెండ్ చేసిన నలుగురు స్లేట్ అభ్యర్థులు గెలుపొందారు. ఐదుగురు నాన్ స్లేట్ అభ్యర్థులు కూడా గెలిచి సత్తా చాటారు. స్లేట్ నుంచి గెలిచిన వారిలో న్యూజెర్సీ వాసి సంతోష్ రెడ్డి కోరం, అట్లాంటా వాసి శ్రీధర్ తిరుపతి, హ్యూస్టన్ వాసి శ్రీధర్ కంచరకుంట్ల, వర్జీనియా వాసి సుధీర్ బండారు ఉన్నారు. నాన్ స్లేట్ నుంచి లాస్ ఏంజిల్స్ వాసి విజయ్ రెడ్డి తూపల్లి , చికాగో వాసి రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి విజయం సాధించించారు.
నాన్ స్లేట్ నుంచి గెలిచిన వారిలో విజయ్ కుందూర్ – న్యూజెర్సీ, విష్ణు మాధవరం-వర్జీనియా, శ్రీనివాస్ శ్రీరామ – అట్లాంటా ఉన్నారు. న్యూ జెర్సీ వాసి సంతోష్ రెడ్డి కోరం అందరికంటే ఎక్కువ ఓట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచారు. సంతోష్ కోరం ఇటు స్లేట్ అటు నాన్ స్లేట్ నుంచి రెండు వైపులా ఓటర్లను ఆకర్షించి.. తన ప్రత్యేకతను చాటుకున్నారు.నాన్ స్లేట్ నుంచి లాస్ ఏంజిల్స్ వాసి విజయ్ రెడ్డి తూపల్లి, చికాగో వాసి రామిరెడ్డి వెంకటేశ్వర ఆర్వి రెడ్డి విజయ ఢంకా మోగించారు. వీరి గెలుపుతోనే ఆటా చరిత్రలోనే మొదటిసారి నాన్ స్లేట్ అభ్యర్థుల హవా కనబడిరది. గ్రాండ్ ప్యాట్రన్ కేటగిరీలో ముగ్గురు కాశీ విశ్వనాథ రెడ్డి కొత్త, రామ్ మట్టపల్లి, శ్రీధర్ బాణాల.. స్లేట్ నుంచి గెలిచారు. ప్యాట్రన్ కేటగిరీలో ఒకరు స్లేట్ నుంచి, ఇద్దరు నాన్ స్లేట్ నుంచి గెలిచారు. శారద సింగిరెడ్డి, రవీందర్ కె. రెడ్డి, వెన్ రెడ్డి ప్యాట్రన్ కేటగిరీలో విజయం సాధించారు. న్యూ జెర్సీ, అట్లాంటా, వర్జీనియా నుండి ఇటు స్లేట్ అటు నాన్ స్లేట్ అభ్యర్థులు గెలుపొందడం విశేషం.







